కొరటాల తిరిగి ఏమీ అనడనేగా చిరంజీవి ధైర్యం!

By Sambi ReddyFirst Published Oct 2, 2022, 5:20 PM IST
Highlights

ఆచార్య ఫెయిల్యూర్ పై పదే పదే చిరంజీవి ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివను విమర్శించడం ఏం బాగాలేదు. పరిశ్రమలో మంచి పేరున్న సీనియర్ హీరో చిరు ప్రవర్తన ఆయన స్థాయికి తగ్గట్లు లేదు. 
 

సినిమా అనేది పెద్ద జూదం. పరిశ్రమ సక్సెస్ రేట్ కేవలం 2%. అంటే ప్రతి వంద చిత్రాల్లో రెండు మాత్రమే విజయం సాధిస్తాయి. ఏడాదికి టాలీవుడ్ 300లకు పైగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కానీ విజయం సాధించినవి ఎన్నంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒక సినిమా సక్సెస్ ని అనేక ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. విడుదల సమయం, సీజన్, ప్రేక్షకుల మూడ్, ట్రెండ్, టికెట్స్ ధరలు, పాలిటిక్స్ ఇలా పలు విషయాలు సహకరించాలి. అంటే దర్శకుడు సినిమా బాగా తీసినంత మాత్రాన, నటులు గొప్పగా చేసినంత మాత్రాన సక్సెస్ అవదు. 

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా విజయం ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చిరంజీవికి ఇవన్నీ తెలియని కావు. ఆయన ఆచార్య కంటే ఘోరమైన వైఫల్యాలు చూశారు. వరుస పరాజయాలతో కృంగిపోయిన రోజులు బ్లాక్ బస్టర్స్ తో నింగికి ఎగిరిన సందర్భాలు ఉన్నాయి.  ఆచార్య కూడా కెరీర్ లో ఎదురైన ఒక ప్లాప్ అన్నట్లు తీసుకోకుండా ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివపై ఆయనకు అంత అసహనం ఎందుకో అంతుపట్టడం లేదు. 

ఆ మూవీ విడులయ్యాక నాలుగైదు సందర్భాల్లో చిరంజీవి దర్శకుడు కొరటాలను టార్గెట్ చేశారు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి, ఆచార్య ఫెయిల్యూర్ మొత్తం కొరటాల మీదకు నెట్టేస్తారు. చరణ్, నేను దర్శకుడు చెప్పింది చేశాము. అది ఆయన ఛాయిస్. ఆచార్య ఫెయిల్యూర్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయదు అన్నారు. ప్రతి హీరో సక్సెస్ స్క్రిప్ట్ సెలక్షన్ జడ్జ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీని శాసించిన హీరోగా చిరంజీవి ఈ విషయంలో గొప్పవాడై ఉండాలి. 

మరి కొరటాల చెప్పిన స్క్రిప్ట్ ఆయన అంత గుడ్డిగా ఎలా ఓకే చేశారనేది కూడా పాయింట్. ఈ వివాదంలో చిరంజీవి ధైర్యం ఒక్కటే. కొరటాలను ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఆయన తిరిగి ఏమీ అనరు. ఒక ఇండస్ట్రీ పెద్దపై వ్యతిరేక గళం విప్పే సాహసం చేయరు. ఐదారుగురు స్టార్ హీరోలున్న మెగా కాంపౌండ్ తో శత్రుత్వం పెట్టుకునే మూర్ఖుడు కాదు. చిరంజీవితో వివాదం అంటే ఆ ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ మిస్సయినట్లే. కాబట్టి కొరటాల మౌనంగా సహిస్తారు. కొరటాల ఎదురు మాట్లాడారని బాగా తెలిసిన చిరంజీవి ఈ విమర్శలు కొనసాగిస్తారు. 
 

click me!