తెలంగాణ కోసం పవన్‌, ప్రభాస్‌ భారీ విరాళం..ఎవరెవరు ఎంతంటే?

Published : Oct 21, 2020, 08:35 AM IST
తెలంగాణ కోసం పవన్‌, ప్రభాస్‌ భారీ విరాళం..ఎవరెవరు ఎంతంటే?

సారాంశం

తెలంగాణ వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు, వారికి సహాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు కదిలారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది తారలు తమ విరాళాలు ప్రకటించారు.

తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్‌ కదిలింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యం హైదరాబాద్‌ నగరం నీట మునిగి సముద్రాన్ని తలపిస్తుంది. అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇంకా నగరం కోలుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు భారీగా ఫండ్‌ కావాలి. 

అందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు కదిలారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది తారలు తమ విరాళాలు ప్రకటించగా, తాజాగా ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ప్రభాస్‌ కోటీ యాభై లక్షలు విరాళంగా ప్రకటించగా, పవన్‌ కళ్యాణ్‌ కోటీ రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌గా ఈ మొత్తాన్ని అందించబోతున్నారు. 

వీరితోపాటు రవితేజ పది లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ పదిలక్షలు, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పది లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్‌బాబు చెరో కోటీ రూపాయలు, నాగార్జున, ఎన్టీఆర్‌ చెరో యాభై లక్షలు, విజయ్‌ దేవరకొండ పది లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?