
తమిళ, తెలుగు ప్రేక్షకులకు హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. తనదైన నటనతో పాటు.. తన అన్న సూర్య కూడా చేయలేని పనిచేసి టాలీవుడ్ ను ఇప్రెస్ చేశాడు కార్తీ. తెలుగులో కూడా తనపాత్రకు తానే స్పస్టంగాడబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇక తెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు హీరో కార్తీ. తెరపైనే కాకుండా సోషల్ మీడియలోనూ తన అభిమానులను అలరిస్తుంటాడు. తన సినిమాలకు సబంధించిన అప్ డేట్స్ తో పాటు.. ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలు శేర్ చేసుకుంటాడు కార్తీ. నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు.
ఇక ఈ నేపథ్యంలో కార్తీ కి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కార్తీ స్వయంగా ట్వీట్ వేసి తన అభిమానులను అప్రమత్తం చేశాడు. హలో గాయ్స్.. నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయింది.. ఫేస్ బుక్ టీంతో కలిసి పని చేస్తున్నాం.. నా పేజీని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం ఇప్పుడు కొత్తేమి కాదు. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయాయి. రీసెంట్ గా యాంకర్ విష్ణు ప్రియా అకౌంట్ కూడా హ్యాక్ చేసి.. వల్గర్ ఫోటోస్ శేర్ చేశారు. గతంలో కుష్ఫులాంటి ఎంతో మంది స్టార్స్ అకౌంట్స్ హ్యాకింగ్స్ కు గురయ్యాయి. ఈ మధ్య హ్యాకింగ్ కు గురయిన విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీలో అన్నీ అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు విష్ణుప్రియ తన ఫేస్ బుక్ ఖాతా సమస్యలను పరిష్కరించుకోలేకపోయింది.
హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో వల్లవరాయ పాత్రలో సినిమా ఆసాంతం అలరించాడు. అలరించాడు. రీసెంట్‌గా సర్దార్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాటర్ బాటిళ్ల స్కాం నేపథ్యంలో సర్దార్ సినిమా చేసి ప్రపంచానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో కార్తీ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇక కార్తీ కొత్త సినిమా జపాన్‌కు సంబంధించిన అప్డేట్ నేడు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమాన్యుయేల్ నటిస్తోంది. సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ మీద నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు.