
కోలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తమిళ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ (Gautham Karthik) మరియు తమిళ హీరోయిన్ మంజిమా మోహన్ (Manjima Mohan) మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబుతున్నారు. ఎప్పటి నుంచో ప్రేమ సంద్రంలో మునిగి తేలుతున్న ఈ లవ్ బర్డ్స్ ఇక వివాహానికి సిద్ధమయ్యారు. వారి ప్రేమను ప్రకటిస్తూ రీసెంట్ గా కొన్ని రొమాంటిక్ పిక్స్ ను కూడా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేశాకే అనౌన్స్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తమ రిలేషన్ గురించి కూడా అధికారికంగా ప్రకటన చేశారు. రీసెంట్ గా వారు పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో క్రేజీ న్యూస్ కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు అభిమానులు కూడా పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ 28న చెన్నైలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనున్నట్టు తెలుస్తోంది. చెన్నై, ఊటీలో గ్రాండ్ గా రిసెప్షన్ కు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం.
‘కడలి’తో గౌతమ్ కార్తీక్ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. తమిళంలోనే తనదైన పెర్షామెన్స్ తో గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరోయిన్ మంజిమా మోహన్ కూడా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’లో కీలక పాత్రలో అలరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ ఫిల్మ్ ‘అక్టోబర్ 31st లేడీస్ నైట్’లో నటిస్తోంది.
ఇక గౌతమ్ కార్తీక్, మంజిమా ‘దేవరట్టం’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఘాఢమైన ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి డేటింగ్ లో ఉన్న యంగ్ యాక్టర్స్ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఈ జంట ఇంకా స్పందించలేదు.