
బాహుబలి తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై టాలీవుడ్ ఆధిపత్యం పెరిగిపోయింది. బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టిన బాహుబలి బాలీవుడ్ కి సవాల్ విసిరింది. తర్వాత సాహో, పుష్ప తాజాగా ఆర్ ఆర్ ఆర్ భారీ హిట్స్ నమోదు చేశాయి. అక్కడ స్టార్ హీరోలకు వంద కోట్ల వసూళ్లంటే గగనంగా ఉంటే సౌత్ హీరోలు అవ్వలీలగా ఆ మార్క్ దాటేస్తున్నారు. ఈ పరిణామం నచ్చని బాలీవుడ్ హీరోలు ఏదో ఒక రూపంలో అక్కసు వెళ్ళగక్కుతున్నారు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తెలుగు చిత్ర పరిశ్రమపై తన ఈర్ష్యను భయటపెట్టారు.
ప్రభాస్ సలార్ మూవీలో జాన్ అబ్రహం నటిస్తున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై జాన్ అబ్రహంని క్లారిటీ అడగ్గా... ఆయన ఒకింత ఫైర్ అయ్యారు. రిపోర్ట్ ప్రశ్నకు సమాధానంగా... ''నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను ఓ హిందీ హీరోని. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్ హీరో, సహానటుడి పాత్రలు చేయను. ఇతర నటుల మాదిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటింబోయే ప్రసక్తే లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.
జాన్ తాజా చిత్రం ఎటాక్ ఏప్రిల్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మూవీ టీంతో కలిసి జాన్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఓ జర్నలిస్ట్ పై ఆయన ఫైర్ అయ్యారు.మీడియా సమావేశంలో జర్నలిస్ట్ జాన్‌ను మీ సినిమాల్లో యాక్షన్ ఓవర్ డోస్ ఉంటుంది. మీరు నలుగురైదుగురితో పోరాడుతుంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం బైక్‌లను విసిరేయడం, మీ చేతులతో ఛాపర్‌లను ఆపడం వంటివి కొన్ని చూస్తే కొంచెం అతిగా అనిపిస్తూ ఉంటుందని అడిగారు.
ఈ ప్రశ్నకు జాన్ కోప్పడ్డారు. 'మీరు దేని గురించి మాట్లాడుతున్నారు' అని ఆ జర్నలిస్ట్‌ను అడగ్గా.. 'సత్యమేవ జయతే' గురించి అని అతను బదులిచ్చాడు. అందుకు జాన్ అబ్రహం 'నేను ఎటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు దీంతో ఏమైనా సమస్య ఉంటే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నిజంగా బాధపెట్టాను.' అని వెటకారంగా సమాధానమిచ్చాడు జాన్. అనంతరం ఫిట్‌నెస్ గురించి అడిగిన ప్రశ్నకు 'శారీరకంగా ఫిట్‌గా ఉండటం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తుంటాను. క్షమించండి సార్. మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ వెటకారంగా మాట్లాడాడు.