
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాననున్నాయి. ఇప్పటికే లైగర్ Liger మూవీని పూర్తి చేసుకున్న ఈ టీం, వెంటనే మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తోంది. ఈ మేరకు మరో పాన్ ఇండియా మూవీగా JGM చిత్రాన్ని ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. పేట్రియాటిక్ సబ్జెక్టు తో డైనమిక్ డైరెక్టర్ పూరి JGM (జనగణమన)ను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.
ఇటీవల అధికారిక ప్రకటన జరగడంతో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రెస్ మీట్లో పాల్గొన్న చిత్ర యూనిట్ మూవీ డిటైల్స్ పంచుకున్నారు. కాగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో చేయాలనుకున్న పూరి జగన్నాధ్ కుదరకపోవడంతో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కమిట్ అయ్యాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక జేజీఎం చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయనున్నట్టు ముందగానే ప్రకటించారు. దీంతో త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Minister Rajnath Singh)ను పూరి జగన్నాథ్ Puri, విజయ్ దేవరకొండ, చార్మి కౌర్, వంశీ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కొత్త సినిమా వివరాలను మినిస్టర్ కు తెలియజేశారు. తాజా సమాచారం మేరకు ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ నుంచి సినిమాకు కావాల్సిన సహాయ సహకారాలను కోరినట్టుగా తెలుస్తోంది. ఇక విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) కలిసి నటించిన చిత్ర లైగర్ ఆగస్టు 25న రిలీజ్ కానుంది.