
ఎన్టీఆర్ జన్మదినం నేడు. ఆయన 40 ఏట అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని విష్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ పై ఆయన అత్యంత అభిమానం కుమ్మరించారు.
హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్! ఈ పుట్టినరోజు సంతోషాలతో నిండాలి. రానుంది యాక్షన్ ప్యాక్డ్ ఇయర్. నీ కోసం యుద్ధ భూమిలో ఎదురుచూస్తున్నా మిత్రమా. నీవు సుఖశాంతులతో జీవించాలి. మనం కలిసే వరకు... పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!... అని ట్వీట్ చేశారు. హృతిక్ రోషన్ ట్వీట్ ఆయనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వార్ 2 చిత్ర సెట్స్ లో కలుద్దామని పరోక్షంగా తన ట్వీట్లో హృతిక్ రోషన్ తెలియజేశారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్ర దర్శకుడు. ఇటీవల వార్ 2 పై బాలీవుడ్ వర్గాలు ప్రకటన చేశాయి. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి చేస్తున్నట్లు వెల్లడించాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన దేవర ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.