'ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే..' హీరో కామెంట్స్!

Published : Feb 13, 2019, 04:23 PM ISTUpdated : Feb 13, 2019, 04:24 PM IST
'ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే..' హీరో కామెంట్స్!

సారాంశం

నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'హీరో హీరోయిన్'. జీఎస్ కార్తిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. 'మీ హీరోల సినిమాలు పైరసీ చేసేది నేనే' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. 

'మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా..?' అంటూ ఫ్యాన్స్ నవీన్ చంద్ర చొక్కా పట్టుకుంటే.. 'నెక్స్ట్ వీక్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా' అని చెప్పగా.. సదరు అభిమాని సంతోషంగా ఫీల్ అవ్వడం చూపించారు.

అలానే హీరో 'ప్రతి మగాడు ప్లేబాయే.. ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే' అని చెప్పే డైలాగులు టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. చివరగా.. ''తమిళరాకర్స్ జిందాబాద్'' అంటూ హీరో చెప్పడం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. 

గాయత్రి సురేష్, పూజా జవేరీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా