కథ పూరి కంటే బాగా చెప్పాడా?

Published : Feb 13, 2019, 03:26 PM IST
కథ పూరి కంటే బాగా చెప్పాడా?

సారాంశం

యువ హీరో రామ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వరుస ఆఫర్స్ అందుకోవడంలో ముందుటాడు. మంచి ఎనర్జీతో ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించే ఈ యువ కథానాయకుడు ఇటీవల కథలను ఒకే చేయడంలో చాలా సమయం తీనుకున్నట్లు కథనాలు వచ్చాయి. 

యువ హీరో రామ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వరుస ఆఫర్స్ అందుకోవడంలో ముందుటాడు. మంచి ఎనర్జీతో ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించే ఈ యువ కథానాయకుడు ఇటీవల కథలను ఒకే చేయడంలో చాలా సమయం తీనుకున్నట్లు కథనాలు వచ్చాయి. 

ముఖ్యంగా పూరి లాంటి సీనియర్ దర్శకుడి ప్రాజెక్టును ఒకే చేయడానికి కొన్ని నెలల వరకు సమయం తీసుకున్న రామ్ ఇప్పుడు ఓ కుర్ర దర్శకుడికి మాత్రం సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పట్లో ఒకడుండే వాడు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చంద్ర ఇటీవల రామ్ కు ఒక కథను వినిపించాడు. అయితే కథలో మెయిన్ పాయింట్ నచ్చడంతో రామ్ సింగిల్ సిట్టింగ్ లో సినిమా చేస్తున్నట్లు డేట్స్ కూడా ఇచ్చేశాడట.

ఇస్మార్ట్ శంకర్ కథను నాలుగైదు సార్లు విని కానీ ఒకే చేయని రామ్ పూరి కంటే కొత్త దర్శకుడు చెప్పిన విధానం బాగా నచ్చినట్లు ఉంది. అందుకే సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చేస్తోన్న ఇస్మార్ట్ శంకర్ జూన్ లో రిలీజ్ కానుంది. అనంతరం రామ్ తన నెక్స్ట్ సినిమాను మొదలెట్టనున్నాడు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా