Shiva Shankar: ఇంకా క్రిటికల్ గానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, పెద్ద మనసు చాటుకున్న హీరో ధనుష్

pratap reddy   | Asianet News
Published : Nov 25, 2021, 09:19 PM IST
Shiva Shankar: ఇంకా క్రిటికల్ గానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, పెద్ద మనసు చాటుకున్న హీరో ధనుష్

సారాంశం

వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు శివశంకర్ మాస్టర్. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు. రొమాంటిక్, విభిన్నమైన పాటలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ సౌత్ లో పాపులర్ అయ్యారు.

వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు శివశంకర్ మాస్టర్. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు. రొమాంటిక్, విభిన్నమైన పాటలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ సౌత్ లో పాపులర్ అయ్యారు. కానీ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇటీవల శివశంకర్ మాస్టర్ కరోనాకి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏజిఐ ఆసుపత్రిలో శివశంకర్ మాస్టర్ కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొని ఉంది. శివ శంకర్ మాస్టర్ కుటుంబంలో ఆయన కుమారుడు అజయ్ కృష్ణ మినహా మిగిలిన వారందరికీ కరోనా సోకింది. దీనితో శివ శంకర్ మాస్టర్ కుటుంబంలో ప్రస్తుతం దయనీయ పరిస్థితి నెలకొంది. 

వైద్య ఖర్చుల ఎక్కువవుతుండడంతో వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. దీనితో అజయ్ కృష్ణ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. అపర కర్ణుడిగా గుర్తింపు పొందిన నటుడు సోనూసూద్ శివ శంకర్ మాస్టర్ వైద్యం కోసం సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. తాను ఇప్పటికే శివశంకర్ మాస్టర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నానని అన్నారు. 

తాజాగా మరో క్రేజీ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తోంది. ' తిరుడా తిరుడి' అనే చిత్రం ధనుష్ కి హీరోగా మూడవ చిత్రం. 2003లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి డాన్స్ కొరియోగ్రఫీ శివ శంకర్ మాస్టర్ అందించారు. అలా ధనుష్ కి, శివశంకర్ మాస్టర్ తో పరిచయం ఉంది. 

Also Read: Kangana Ranaut: వల్గర్ ఫోజు, వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు

శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. ధనుష్ ఎంత మొత్తం సాయం అందించారని వివరాలు తెలియరాలేదు. శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ధనుష్ కోరుకున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?