Cauliflower: అమీర్ తర్వాత నేనే... అమ్మో సంపూ బడాయి మామూలుగా లేదే!

By team teluguFirst Published Nov 25, 2021, 4:27 PM IST
Highlights

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నుండి వస్తోన్న మరొక కామెడీ ఎంటర్టైనర్ క్యాలీఫ్లవర్. రేపు గ్రాండ్ గా విడుదల అవుతుండగా, సంపూర్ణేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. 
 

హృదయ కాలేయం మూవీ సామాన్యుడిని స్టార్ గా మార్చేసింది. తెలంగాణాలోని ఓ పల్లెటూరిలో బంగారం పని చేసుకునే నరసింహ చారి కాస్త సంపూర్ణేష్ బాబు అయ్యాడు. స్పూఫ్ కాన్సెప్ట్ తో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన హృదయ కాలేయం మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో...  అసలు ఎవరు ఈ సంపూర్ణేష్ బాబు? అనే చర్చ నడిచింది. ఆ మూవీ టీమ్ ఆయనను అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ఐ గా పరిచయం చేశారు. మెల్లగా తర్వాత అతని డిటైల్స్ రివీల్ చేశారు. 


దానికి కారణం ఆ సినిమా దర్శక నిర్మాత సాయి రాజేష్ భయపడ్డాడు. ఈ మూవీ చూసిన జనాలు, ఇండస్ట్రీ వాళ్లపై దాడి చేస్తారేమో అని, అందరూ మారు పేర్లు టైటిల్స్ కి వాడారు. సాయి రాజేష్ తన పేరు స్టీవెన్ శంకర్ గా మార్చుకున్నాడు. సినిమా విడుదలయ్యాక అద్భుత రెస్పాన్స్ దక్కింది. తర్వాత తమ రియల్ ఐడెంటిటీని రివీల్ చేశారు. మళ్ళీ  అదే బ్యానర్ లో 2019లో కొబ్బరి మట్ట మూవీతో సంపూర్ణేష్ బాబు భారీ విజయం అందుకున్నాడు. కాగా ఆయన లేటెస్ట్ మూవీ క్యాలీఫ్లవర్ (Cauliflower)విడుదలకు సిద్ధమైంది. మగాళ్ల శీలాన్ని కాపాడే క్యాలీఫ్లవర్ గా సంపూర్ణేష్ బాబు (Sampoornesh babu)కామెడీ రోల్ చేస్తున్నారు. క్యాలీఫ్లవర్ రేపు విడుదల అవుతుండగా, మూవీ గురించి ఆయన కొన్ని ఆసక్తికర వ్ విశేషాలు వెల్లడించారు. 


తన సినిమాలలో తాను ఎంత ఎక్కువ చేస్తే.. ప్రేక్షకులు అంతగా నవ్వుతారు అన్నారు. దాని ఆధారంగా దర్శకులు నా కోసం కథలు రాస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో నగ్నంగా నటించడం పై సంపూర్ణేష్ స్పందించారు. బట్టలు లేకుండా క్యాలీఫ్లవర్ అలా అడ్డుపెట్టుకొని నిల్చున్న ఫోటోలు చూసి , మా బంధువులు ఏంటి మరీ అలా నటించవావ్ అని అడిగారు. దాన్నివాళ్ళు అంత సీరియస్ గా తీసుకున్నారా, అని తనకు తర్వాత అనిపించింది, అన్నారు.

Also read నాగశౌర్య 'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక అమీర్ (Ameer khan)తర్వాత అలా చేసిన ఏకైన యాక్టర్ నేనే అన్నారు సంపూర్ణేష్ బాబు. ఆయన పీకే మూవీలో రేడియో అడ్డుపెట్టుకుంటే... నేను క్యాలీఫ్లవర్ అడ్డుపెట్టుకున్నాని, కామెడీగా చెప్పాడు. దర్శకుడు ఆర్ కే మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు.

Also read చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం, అర్థం చేసుకోండి... సీఎం జగన్ కి చిరు విజ్ఞప్తి

click me!