HBD Nagarjuna: మై డియర్ మన్మధా.... పుట్టినరోజు శుభాకాంక్షలు!

Published : Aug 29, 2023, 04:52 PM ISTUpdated : Aug 29, 2023, 05:28 PM IST
HBD Nagarjuna: మై డియర్ మన్మధా.... పుట్టినరోజు శుభాకాంక్షలు!

సారాంశం

నేడు కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో నాగార్జున బర్త్ డే విషెస్ చెప్పారు.   

హీరో నాగార్జున(Nagarjuna) బర్త్ డే నేడు. 1959 ఆగస్టు 29న జన్మించిన నాగార్జున 64వ ఏట అడుగు పెట్టారు. నాగార్జునకు చిత్ర ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నాగార్జునకు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 

నా ప్రియ మిత్రుడు, ఎప్పటికీ మన్మధుడు నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో విజయపథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. అని చిరంజీవి (Chiranjeevi)ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతుంది. పరిశ్రమలో చిరంజీవి-నాగార్జున చిరకాల మిత్రులు. 

కాగా నేడు నాగార్జున కొత్త మూవీ ప్రకటించారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగ చిత్రం చేస్తున్నారు. మాస్ లుక్ లో అదరగొట్టిన నాగార్జున నా సామిరంగ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. నా సామిరంగ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. నా సామిరంగ చిత్రాన్ని శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా