కులాన్ని కించపరిచారు క్షమాపణలు చెప్పాలి... వివాదంలో బాలయ్య కామెంట్స్ 

By Sambi ReddyFirst Published Jan 14, 2023, 4:45 PM IST
Highlights

ఇటీవల ఓ ఇంటర్వ్యూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఓ సామాజిక వర్గం బాలకృష్ణ మమ్మల్ని కించపరిచారు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 
 


బాలయ్యకు పురాణాలపై మంచి పట్టుంది. తెలుగు భాషతో పాటు పురాణాల మీద ఆయన అవగాహన పెంచుకున్నారు. అప్పుడప్పుడూ తన పురాణ పాండిత్యంతో ఈ జనరేషన్ నటులను భయ పెడుతూ ఉంటారు. ఈ కోణంలో బాలయ్య చేసిన లేటెస్ట్ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. వీరసింహారెడ్డి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఒక సందర్భం గురించి మాట్లాడుతూ... దేవబ్రాహ్మణులకు దేవళ మహర్షి గురువు. వారి నాయకుడు రవాణాసురుడు అని చెప్పాడు. 


ఈ వ్యాఖ్యలను దేవాంగ కులస్థులు తప్పుబడుతున్నారు. దేవళ మహర్షి నాయకుడు రావణాసురుడని చెప్పి బాలకృష్ణ చరిత్ర వక్రీకరించారు. దేవాంగుల కుల గురువు దేవళ మహర్షి. కుల దైవం చౌడేశ్వరీ అమ్మవారు. దేవాంగ కుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడి ఉంది. మను చరిత్రతో పాటు పలు ఇతిహాసాలతో ముడి పడి ఉంది. అలాంటి దేవాంగ కులాన్ని కించపరిచేలా బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన నవ్వుతూ ఎగతాళి చేశారంటూ ఆరోపిస్తున్నారు. 

బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దేవాంగ కులానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి బాలయ్య ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఆయన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూకుడు చూపిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. 

click me!