#Prabhasతో లోకేష్ సినిమా ఆ రకంగా కన్ఫర్మ్ చేసారు

Published : Mar 15, 2024, 11:22 AM IST
  #Prabhasతో   లోకేష్ సినిమా ఆ రకంగా కన్ఫర్మ్ చేసారు

సారాంశం

 ఏదైమైనా లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ సినిమా చెయ్యబోతున్నాడు, త్వరలోనే ఈ క్రేజీ ప్యాన్ ఇండియా ..


 సెన్సేషన్ సక్సెస్ అయ్యిన 'ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న  డైరక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో వరసపెట్టి  గ్యాంగ్ స్టర్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు. ఆయన పేరు చెప్తే భాక్సాఫీస్ లు బ్రద్దలు అవుతున్నాయి. రీసెంట్ గా   ‘లియో’ (Leo) కు దర్శకత్వం వహించారు.   విజయ్ (Vijay) హీరోగా చేసిన ఈ చిత్రం మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. ఓటిటి రైట్స్ సైతం అదిరిపోయే రైట్స్ కు వెళ్లాయి. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టీ ఉంది. ప్రస్తుతం రజనీతో సినిమా చేస్తున్న లోకేష్ ..తమ అభిమాన హీరో ప్రభాస్ తో ఎప్పుడు చేస్తాడు..అసలు చేస్తాడా లేదా అనే విషయంపై అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అప్డేట్ వచ్చేసినట్లే అంటున్నారు అభిమానులు.

 లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు మార్చ్ 14 సందర్భంగా విషెష్ చెప్పిన పోస్టర్స్ లోనే ఆ కంటెంట్ ఉందంటన్నారు. బెంగుళూరుకు చెందిన  KVN ప్రొడక్షన్స్ కంపెనీ ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించబోతోంది. లోకేష్ కు విషెష్ చెప్తూ వదిలిన పోస్టర్ ని చూసి ఆ మాటలు అంటున్నారు అభిమానులు. అయితే ఎక్కడా ఆ పోస్టర్ పై ప్రభాస్ పేరు కానీ మరొకటి కానీ లేకపోవటం విశేషం.  ఏదైమైనా లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ సినిమా చెయ్యబోతున్నాడు, త్వరలోనే ఈ క్రేజీ ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ వస్తోంది అని ఫ్యాన్స్ ఆశలకు ఈ పోస్టర్ కాస్త ఊతం ఇచ్చింది. 

ఆ మధ్యన ఓ  ఇంటర్వ్యూలో ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‍తో తాను చేసే సినిమా ఎల్‍సీయూలో భాగం కానేకాదని అన్నారు. ఆ చిత్రం స్టాండలోన్‍గా ప్రత్యేకంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి సంబంధం ఉండదని లోకేశ్ స్పష్టం చేశారు. తన గత చిత్రాలకు లింక్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను లోకేశ్ సృష్టించారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలకు లింక్ పెట్టారు. అలాగే, లియో కూడా ఎల్‍సీయూలో భాగమేనని తెలుస్తున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఎల్‌సీయూ ముగింపు గురించి కూడా లోకేశ్ చెప్పారు. కమల్ హాసన్‍తో చేసే విక్రమ్ 2 సినిమాతోనే ఎల్‍సీయూ ముగుస్తుందని చెప్పేశారు. ప్రభాస్‍తో చేసే సినిమాకు ఎల్‍సీయూతో సంబంధం ఉండదని, ఆయన కోసం ప్రత్యేకమైన ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు. 
 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు