సెట్‌లో అందరి ముందు అవమానించిన దర్శకుడు.. ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నేచురల్‌ స్టార్‌ నాని..

Published : Mar 23, 2023, 03:43 PM IST
సెట్‌లో అందరి ముందు అవమానించిన దర్శకుడు.. ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నేచురల్‌ స్టార్‌ నాని..

సారాంశం

హీరో నాని `దసరా` చిత్రంతో పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తనకెదురైన అవమానం గురించి వెల్లడించారు. 

నేచురల్‌ స్టార్‌ నాని తన రూట్‌ మార్చి ఇప్పుడు `దసరా` చిత్రంలో నటించారు. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. తనకు బలమైన ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ఓ రా, రస్టిక్‌ కథతో మాస్‌ మూవీ చేశాడు నాని. ఊరమాస్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా వైడ్‌గా తిరుగుతున్నారు నాని. అందులో భాగంగా ఇప్పుడు ఆయన ముంబయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. 

తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన స్ట్రగుల్స్ గురించి ఓపెన్‌ అయ్యారు నాని. తనకు ఎదురైన అవమానాలను వెల్లడించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అందులో ఓ దర్శకుడు తనని సెట్‌లోనే అందరి ముందు అవమానించాడని, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. 

నాని మాట్లాడుతూ, తాను బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చానని, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు, సాయం చేయడానికి ఎవరూ ఉండరు, మనం నేర్చుకుంటున్న సమయంలోనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ దాని తర్వాత వచ్చే సక్సెస్‌ చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆ ఫీలింగ్‌ వేరే అని వెల్లడించారు. అయితే ప్రారంభంలో తాను అనేక సవాళ్లు, తిరస్కరణలు ఎదుర్కొన్నారట. `ఆ విషయాలు ఇప్పుడు చెప్పను, సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మందితో పోలిస్తే నేను పెద్దగా ఇబ్బందులు పడలేదని భావిస్తున్నా. నాకంటే ఇంకా ఎక్కువ కష్టాలు పడ్డవాళ్లు నాకు తెలుసు` అని చెప్పాడు నాని. 

ఈ క్రమంలో ఆయన తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తాను క్లాప్‌ బాయ్‌ గా ఉండేవాడట. ఆ సమయంలో ఓ దర్శకుడు తనని చాలా అవమానించాడని చెప్పారు. క్లాప్‌ బాయ్‌ తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పాడు. క్లాప్‌ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారు, నీకు ఎవరు పడితే వాళ్లు పనులు చెబుతుంటారు. ఇష్టం వచ్చిన మాటలు అనేవారని, వారందరికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా చెప్పలేని స్థితి, అన్నింటిని దిగమింగక తప్పదని తెలిపారు నాని. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు తాను ఫేస్‌ చేసినట్టు చెప్పారు. 

అయితే తనని మాటలు అన్నందుకు ఎప్పుడూ బాధపడలేదట, కానీ ఓ దర్శకుడు మాత్రం సెట్‌ అందరి ముందు తనని అవమానించాడట. తాను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నాడు. ఆ మాట తనని తీవ్రంగా మనో వేదనకు గురి చేసిందని, ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు నాని. స్టార్‌ అయ్యాక ఆ దర్శకుడిని కలిశా, అప్పుడు కూడా మా చుట్టూ ఉన్న వాతావరణం చెప్పుకోదగిన విధంగా లేదని వెల్లడించారు నేచురల్‌ స్టార్‌. 

రేడియో జాకీ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అట్నుంచి హీరోగా ఇప్పుడు స్టార్‌ హీరోగా ఎదిగారు నాని. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదగడం మామూలు విషయం కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు `దసరా` తో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు