ఉగాది కానుకగా బాలయ్య అభిమానులకు ‘ఎన్బీకే108’ నుంచి మాస్ అండ్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనికి వచ్చిన రెస్పాన్స్ పై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.
నందమూరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ఎన్బీకే108’. నందమూనరి నటసింహాం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’తో బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి - బాలయ్య కాంబోలో సినిమా రూపుదిద్దుకుంటుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ నుంచే హైప్ క్రియేట్ అవ్వగా.. ఉగాది సందర్భంగా వచ్చిన అప్డేట్ మరింతగా అంచనాలు పెరిగాయి.
బాలయ్యను తన అభిమానులు మునుపెన్నడూ చూడని లుక్ లో చూపించబోతున్నారని నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ఉగాదికి వచ్చిన NBK108 first look కి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నందమూరి నటసింహం రోరింగ్ లుక్ కు ఫిదా అవుతున్నారు. ఢిఫరెంట్ మేకోవర్ తో బాలయ్యను ప్రజెంట్ చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ తో తెలియజేశారు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ పట్ల తాజాగా అనిల్ రావిపూడి స్పందించారు. ‘ఆ కంటి చూపు చెబుతుంది. గిది శాంపిల్ మాత్రమే‘ అంటూ ట్వీట్ చేస్తూ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ను అందరూ స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బాలయ్యను నెవర్ బిఫోర్ లుక్ లో చూపించబోతున్నట్టు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సైతం షూటింగ్ లో పాల్గొన్న విషయం తెసిందే.
అనిల్ రావిపూడి - బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీలా నటిస్తున్నారు. శైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గరికపాటి మరియు హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లోనే చిత్ర షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
THAT LOOK SAYS IT ALL
గిది శాంపిల్ మాత్రమే… 😉
Thanking each & everyone for such a warm reception to Natasimham garu’sfirst look from our 🙏 ❤️ pic.twitter.com/0ngGEYiUd7