చివరికి `గేమ్‌ ఛేంజర్‌` టైటిల్‌ బీజీఎం కూడా కాపీనేనా? థమన్‌ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

జనరల్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కి కాపీ అనే కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి. వినిపించకపోతే ఆశ్చర్యం కానీ వస్తే ఆశ్చర్యమేముంది అనేట్టుగా మారిపోయింది. `గేమ్‌ ఛేంజర్‌` బీజీఎం కూడా ఓ హిందీ ఒరిజినల్‌ సాంగ్‌కి కాపీ అని స్టార్ట్ చేశాడు ట్రోలర్స్. 

game changer bgm also copy trollers comments on music director thaman hot topic arj

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ హవా సాగుతుంది. ఇప్పుడు ఆయన మ్యూజిక్‌ అందించిన సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్స్ అవుతున్నాయి. పాటలన్నీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. మరోవైపు థమన్‌ బీజీఎంకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొట్టారంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అనే పేరుంది. ఇటీవల `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలకు ఆయన అందించిన బీజీఎంలకు ఫ్యాన్స్ జేజేలు కొట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోల సినిమాలకు మ్యూజిక్‌ అందిస్తూ బిజీగా ఉన్నారు థమన్‌. 

అందులో ఒకటి రామ్‌చరణ్‌, శంకర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌`. తాజాగా చరణ్‌ బర్త్ డే సందర్భంగా నేడు ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. కొంచెం ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలుగుతుందంటున్నారు. ఇరగదీశావని చరణ్‌ ఫ్యాన్స్ కూడా థమన్‌కి అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఓ వైపు ఈ `గేమ్‌ ఛేంజర్‌` టైటిల్‌ వీడియో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఎప్పటిలాగే థమన్‌పై ట్రోలర్స్ కూడా రెచ్చిపోతున్నారు. `గేమ్‌ ఛేంజర్‌` బీజీఎంలోనూ మిస్టేక్స్ వెతుకుతున్నారు. ఇది కూడా కాపీనే అంటున్నారు. 

Happy birthday to the worldwide charmer ⁦⁩ being fierce and daring on screen and a darling off screen makes you a ⁦⁩ ⁦⁩ ⁦⁩ ⁦⁩ pic.twitter.com/t0wLwN8tc0

— Shankar Shanmugham (@shankarshanmugh)

Latest Videos

జనరల్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కి కాపీ అనే కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి. వినిపించకపోతే ఆశ్చర్యం కానీ వస్తే ఆశ్చర్యమేముంది అనేట్టుగా మారిపోయింది. `గేమ్‌ ఛేంజర్‌` బీజీఎం కూడా ఓ హిందీ ఒరిజినల్‌ సాంగ్‌కి కాపీ అని స్టార్ట్ చేశాడు ట్రోలర్స్. అంతేకాదు ఫ్రూప్‌లు కూడా చూపిస్తున్నారు. ఈ రెండు అటు ఇటు సేమ్‌ ఉన్నాయంటున్నారు. బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌, ఊర్వసి రౌతేలా కలిసి చేసిన `లవ్‌ డోస్‌`(టూ ఆజ్‌ మెరీ క్లోజ్‌) సాంగ్‌ని పోలి ఉందంటున్నారు. అయితే హనీ సింగ్‌ మ్యూజిక్‌ కాస్త స్మూత్‌గా వెళితే, థమన్‌ దాని డోస్‌ పెంచాడని, డబుల్‌ డోస్‌ ఇచ్చి ఈ కొత్త బీజీఎం చేశాడని కంపేర్‌ చేస్తున్నారు.

థమన్‌ ఈ బీజీఎం ని ఇక్కడి నుంచే లేపాడని అంటున్నారు ట్రోలర్స్. దీనిపై ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. చివరికి రామ్‌చరణ్‌, శంకర్‌ సినిమాకి కూడా కాపీయేనా అంటున్నారు. ఈ లవ్‌ డోస్‌ సాంగ్‌ తొమ్మిదేళ్ల క్రితం వచ్చింది. అప్పట్లో ట్రెండ్‌ అయ్యింది. కానీ ఇప్పుడు అంతా మర్చిపోయారు. దీన్ని థమన్‌ సైలెంట్‌గా లేపాడని ట్రోలర్స్ వాదన. కానీ థమన్‌ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. దీన్ని కాపీ అనడం కరెక్ట్‌ కాదంటున్నారు. ఏదేమైనా థమన్‌ ప్రతి పాటపై ఇలాంటి కాపీ విమర్శలు రావడం విచారకరం. 

ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌` చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట శంకర్‌. టైటిల్‌ తగ్గట్టుగానే సినిమా కూడా గేమ్‌ ఛేంజర్‌గా ఉండబోతుందని అంటున్నారు. సుమారు మూడువందల యాభైకోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నేడు సోమవారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే టైటిల్‌ని విడుదల చేయగా, మధ్యాహ్నం చెర్రీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారట. అలాగే రిలీజ్‌ డేట్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 

vuukle one pixel image
click me!