షాకిస్తున్న అల్లు అర్జున్ రెమ్యూనరేషన్!

By team teluguFirst Published May 15, 2021, 3:21 PM IST
Highlights

పుష్ప రెండు భాగాలకు కలిపి మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే రెట్టింపు అయ్యింది. ఇక నటులు రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

అల వైకుంఠపురంలో మూవీతో మొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం, అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ మార్కెట్ సత్తా ఏమిటో అల వైకుంఠపురంలో మూవీ నిరూపించగా నెక్స్ట్ మూవీ పుష్ప భారీగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

అలాగే పుష్ప రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. పుష్ప కథ చెప్పడానికి చాలా పెద్దదని భావించిన సుకుమార్ రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక బడ్జెట్ సైతం ఏకంగా రూ. 270కోట్ల వరకు పెంచేశారు. రెండు భాగాలకు కలిపి మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే రెట్టింపు అయ్యింది. ఇక నటులు రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 


కాగా పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ రూ. 50కోట్లు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది. రెండు భాగాలకు గాను అల్లు అర్జున్ రూ. 70- 80 కోట్లు తీసుకుంటున్నారని వినికిడి. అంటే ఒక మూవీకి ఆయన రూ. 40కోట్లు తీసుకుంటున్నారన్న మాట. అల్లు అర్జున్ గత చిత్రాల రెమ్యూనరేషన్ తో ఇది రెట్టింపు అని చెప్పాలి. 


దర్శకుడు సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 

click me!