పవన్ కల్యాణ్ పిలుపు కోసం రాణిగారు వెయిటింగ్

Surya Prakash   | Asianet News
Published : May 15, 2021, 02:41 PM ISTUpdated : May 15, 2021, 02:45 PM IST
పవన్ కల్యాణ్ పిలుపు కోసం రాణిగారు వెయిటింగ్

సారాంశం

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ .. రాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా నిలుస్తుందిట. నిధి అగ‌ర్వాల్ ..పవన్ సరసన చేయనుంది.  

రాజకీయాల కారణంగా చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై మంచి హిట్టైంది. ఇప్పుడు ఓటీటిలోనూ దుమ్ము రేపుతోంది. ఆ తర్వాతా  ప్రస్తుతం పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌ అది. ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ తన 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.  ‘హరిహర వీరమల్లు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా  ఓ ఇంట్రెస్టింగ్‌, పవర్‌ఫుల్‌ కథతో రూపొందుతోంది.

 ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని సెకండ్ వేవ్ ప్రారంభం కాకముందే పిబ్రవరిలోనే ఆపేసారు. వకీల్ సాబ్ ప్రమోషన్ కోసం, సాగర్ చంద్ర సినిమాలో కొంత భాగం కంప్లీట్ చేయటం కోసం పవన్ తన డేట్స్ కేటాయించారు. ఆ తర్వాత ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయాయి. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌‌తో పాటు నిధి అగ‌ర్వాల్ మరో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎప్పుడు నటిద్దామా అని జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ ఎదురుచూస్తోందిట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా రీసెంట్ గా బాలీవుడ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. తాను పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తాను షూటింగ్ లో పాల్గొనటానికి క్రిష్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

ఈ సినిమాలో  జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ .. రాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా నిలుస్తుందిట. నిధి అగ‌ర్వాల్ ..పవన్ సరసన చేయనుంది.  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట ఈ సినిమాలో హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి చేసిన కుట్ర, బాలు వద్ద అడ్డంగా దొరికిపోయినా మీనా
ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..