తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

Published : May 23, 2023, 09:45 PM ISTUpdated : May 23, 2023, 09:49 PM IST
తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

సారాంశం

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధమైంది. ఫినాలే గెస్ట్ గా హీరో అల్లు అర్జున్ వస్తున్నారు.   

నంబర్ వన్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రఖ్యాత మ్యూజిక్ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2 స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ రియాలిటీ షో ముగింపు దశకు చేరుకుంది. త్వరలో ఫినాలే స్ట్రీమ్ కానుంది. ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 2 మరింత హుషారుగా సాగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు సింగర్స్ కార్తీక్, గీతా మాధురి, హేమచంద్ర జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలే గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.  తెలుగు ఇండియన్ ఐడల్ 2 అసాధారణ టాలెంటెడ్ సింగర్స్ కి వేదికైంది. ఈ ఈవెంట్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందరికీ బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ అని అన్నారు. సింగర్స్, ఆడియన్స్ తో అల్లు అర్జున్ సరదాగా గడిపారు. ఆయన ప్రెజెన్స్ షోకి ఎనర్జీ తెచ్చిపెట్టింది.

10,000 మందికి పైగా సింగర్స్ తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వీరి నుండి ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరిగింది. దశల వారిగా జరిగిన పోటీలో ఐదుగురు ప్రతిభావంతులు ఫైనల్ కి చేరారు. న్యూజెర్సీకి చెందిన శృతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నం నుండి సౌజన్య భాగవతుల ఫైనల్ కి చేరారు. వీరిలో అసాధారణ ప్రతిభ కనబరిచిన సింగర్ విజేత కానున్నారు. 

ఇక ఫినాలే దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆడియన్స్ లో ఆత్రుత నెలకొంది. ఎవరు విజేత అవుతారనే ఉత్కంఠ రేగుతుంది. ఐదుగురు ఫైనలిస్ట్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల కాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా