హైదరాబాద్ కి మకాం మార్చిన మృణాల్, లగ్జరీ హౌస్ కొనుగోలు?

Published : May 23, 2023, 05:08 PM IST
హైదరాబాద్ కి మకాం మార్చిన మృణాల్, లగ్జరీ హౌస్ కొనుగోలు?

సారాంశం

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దీనిపై సీతారామం బ్యూటీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.   

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో పాగా వేస్తున్నారు మృణాల్ ఠాకూర్. దేశంలోనే పెద్ద పరిశ్రమగా ఎదిగిన తెలుగులో చిత్రాలు చేయాలని ఆమె కోరుకుంటున్నారు. సీతారామం మూవీతో ఆమెకు మంచి ఆరంభం లభించింది. గత ఏడాది విడుదలైన సీతారామం బ్లాక్ బస్టర్ అందుకుంది. దర్శకుడు హను రాఘవపూడి సస్పెన్సు ఎలిమెంట్స్ తో కూడిన అందమైన ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కరించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రంలో సీత పాత్రలో అద్భుతం చేసింది. 

పరిశ్రమను ఆకర్షించిన మృణాల్ కి భవిష్యత్ లో క్రేజీ ఆఫర్స్ తలుపు తట్టనున్నాయి. ప్రస్తుతం నానికి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. నాని చిత్ర షూటింగ్ కోసం తరచుగా మృణాల్ ముంబై నుండి హైదరాబాద్ వస్తున్నారట. దీంతో హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ కొన్నారట. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లు మృణాల్ దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారు. ఆ లగ్జరీ హౌస్ ఎక్కడో చెప్పండి. నేను కూడా ఒకసారి చూస్తాను అని సెటైరికల్ గా మాట్లాడారు. 

ఆమె పరోక్షంగా హైదరాబాద్ లో ఇల్లు కొన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. లవ్ సోనియా మూవీతో ఆమెకు బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో పాపులారిటీ రాబట్టారు. హిందీలో మృణాల్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆమె ఖాతాలో మూడు చిత్రాల వరకూ ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో అనేక అవమానాలు పడ్డట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం