‘భోళా శంకర్’పై చిరు లీక్స్.. స్విట్జర్లాండ్ లో తమన్నాతో మెగాస్టార్ ఆటాపాట.. అదిరిపోయే అప్డేట్

By Asianet News  |  First Published May 23, 2023, 6:44 PM IST

మెగాస్టార్ చిరంజీవి లైనప్ లోని చివరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. తాజాగా చిరు లీక్స్ ద్వారా అదిరిపే అప్డేట్ అందింది.
 


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాల్లో నటిస్తున్నారు. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రిలీజ్ కు సిద్ధమవుతున్న చిత్రం ‘భోళా శంకర్’.  మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చకాచకా జరుగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ఆసక్తికరంగా ఉన్నాయి.

ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లోనూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి - తమన్నా భాటియాలతో యూనిట్ సాంగ్ ను షూట్ చేసింది. ఈ మేరకు చిరంజీవి అప్డేట్ అందించారు. తన సినిమాల గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. అఫీషియల్ అప్డేట్స్ కన్నా ‘చిరు లీక్స్’ ద్వారా వచ్చే అప్డేట్సే ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తుంటాయి. 

Latest Videos

ఈ క్రమంలో Bhola Shankar నుంచి చిరు అదిరిపోయే అప్డేట్ అందించారు. ట్వీటర్ వేదికన షూటింగ్ స్పాట్, బ్యూటీఫుల్ లోకేషన్ నుంచి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. చిరు ట్వీట్ లో.. ‘స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే  అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం  తమన్నాతో  ఆట పాట (Song  Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ  పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను! త్వరలోనే మరిన్ని సంగతులు  పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు లీక్స్' పిక్స్ మీకోసం.‘ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ ను మహతిస్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

రీసెంట్ గా మేడే సందర్భంగా చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరు ఈ చిత్రంలో టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్టు తెలిపారు. ఇక క్లైమాక్స్ షూట్‌ కూడా జరిగినట్టు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని అర్థమవుతోంది. తమన్నా భాటియా (Tamannaah Bhatia)  హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలి పాత్రలో అలరించనుంది. యంగ్‌ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం.

స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది!

ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !

అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!