బిగ్ బాస్ హౌజ్ కి ‘అల్లరి’ అబ్బాయి

Published : Sep 07, 2017, 05:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బిగ్ బాస్ హౌజ్ కి ‘అల్లరి’ అబ్బాయి

సారాంశం

హిట్ కోసం ఎదురుచూస్తున్న నరేష్ ‘మేడమీద అబ్బాయి’తో ప్రేక్షకుల ముందుకు రానున్న నరేష్ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ కి నరేష్

 తన తొలిసినిమా ‘ అల్లరి’ ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయనకు గత కొంత కాలంగా హిట్లు రావట్లేదు. దీంతో చాలా  ఇబ్బంది పడుతున్న ఆయన ప్రస్తుతం ‘ మేడ మీద అబ్బాయి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే భావనలో ఉన్న ఆయన  ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నాడు.

 

సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఆయన  ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బుల్లి తెర రియాల్టీ షో ‘ బిగ్ బాస్’ కి వచ్చాడు. ఇప్పటి కే రానా, విజయ్ దేవరకొండ, తాప్సీ, సచిన్ లాంటి వాళ్లు తమ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌజ్ కి వచ్చారు. ఇప్పుడు వారి బాటలోని ఈ మేడ మీద అబ్బాయి కూడా హౌజ్ లోకి అడుగుపెట్టాడు.

 

 అంతేకాదు.. బిగ్ బాస్ హౌజ్ లో సినిమా ప్రమోట్ చేస్తే.. కచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ కూడా ఉంది. రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ విషయంలో అది నిజమైంది కూడా. మరి ఈ సెంటి మెంట్ నరేష్ కి ఎంత మాత్రం పనిచేస్తుందో  తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. అంతేకాకుండా.. హౌజ్ మెట్స్ తో కలిసి అల్లరి అబ్బాయి ఎంత అల్లరి చేస్తాడో వేచి చూడాలి.

 

‘మేడమీద అబ్బాయి’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో జబర్దస్త్ ఫేం ఆది కీలకపాత్ర పోషించాడు.

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే