Ajith New Movie: నయనతార ప్రియుడితో అజిత్‌ కొత్త సినిమా, అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌ ఇచ్చిన టీమ్.

Published : Mar 18, 2022, 08:32 PM IST
Ajith New Movie: నయనతార ప్రియుడితో అజిత్‌ కొత్త సినిమా, అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌ ఇచ్చిన టీమ్.

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాపై క్లారిటీ వచ్చింది. వాలిమై తరువాత అజిత్ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. గాసిప్స్ కు బ్రేక్ ఇస్తూ.. తన సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాపై క్లారిటీ వచ్చింది. వాలిమై తరువాత అజిత్ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. గాసిప్స్ కు బ్రేక్ ఇస్తూ.. తన సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ రీసెంట్ గా వాలిమై సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.  వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వాలిమై సినిమా తమిళనాట కాసుల వర్షం కురిపించినా.. తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే వాలిమై తరువాత అజిత్ ఏ సినిమా చేస్తారు అన్న విషయంలో రకరకాల మాటలు వినిపించాయి.వాలిమై తరువాత తర్వాత అజిత్ వినోద్ డైరెక్షన్ లోనే సినిమా చేస్తారు అని వార్తులు గట్టిగా వినిపించాయి. 

అయితే ఇంకొన్ని కాంబినేషన్లు సోషల్ మీడియాలో హడావిడి చేశాయి. వాటన్నిటిని బ్రేక్ చేస్తూ.. అజిత్ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశారు. స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో అజిత్ సినిమా చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతూ రాదే ఈ  సినిమాకు  యంగ్ మ్యూజిక్ మిసైల్ అనిరుద్ధ్  సంగీతాన్ని అందించబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను అఫీషియల్ గా ఇచ్చారు మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా నయనతార ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అపీషియల్ గా చెప్పకపోయినా నయనతార హీరోయిన్ గా చేస్తుందంటూ సమాచారం. ఇక గతంలో అజిత్, నయన్ కాంబినేషన్ లో వచ్చిన  బిల్లా ,ఆగన్,ఆరంభం, విశ్వాసం మూవీస్  సూపర్ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?