ప్రమాదకరమైన రియల్ స్టంట్స్ చేస్తున్న స్టార్ హీరో

Published : Nov 27, 2020, 09:06 AM IST
ప్రమాదకరమైన రియల్ స్టంట్స్ చేస్తున్న స్టార్ హీరో

సారాంశం

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వాలిమై కోసం అజిత్ సాహసోపేత స్టంట్స్ చేస్తున్నారు. హై సీసీ స్పోర్ట్స్ బైక్ పై ఆయన ఛేజింగ్ సన్నివేశంలో పాల్గొన్నారు. హై స్పీడ్ లో ఫ్రంట్ టైర్ లేపి మరీ దూసుకువెళుతున్న అజిత్ స్టిల్ బయటికి వచ్చింది. ప్రస్తుతం వాలిమై షూటింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు. 

స్టార్ హీరో అజిత్ రియల్ స్టంట్స్ కి గొప్ప ఫేమస్. కారు రేసర్ గా కూడా ఆయనకు పేరుంది. స్పోర్ట్స్ బైక్స్ అండ్ కార్స్ అంటే ఎంతగానో ఇష్టపడే అజిత్, వాటిపై వాయువేగంతో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాడు. ఇక తన సినిమాలలో కూడా ఆతరహా స్టంట్స్ స్వయంగా డూపు లేకుండా చేయడం విశేషం. ఆయన లేటెస్ట్ మూవీ వాలిమై కోసం ఇలాంటి సాహసాలు చేస్తున్నాడు అజిత్. 

 హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వాలిమై కోసం ఆయన సాహసోపేత స్టంట్స్ చేస్తున్నారు. హై సీసీ స్పోర్ట్స్ బైక్ పై ఆయన ఛేజింగ్ సన్నివేశంలో పాల్గొన్నారు. హై స్పీడ్ లో ఫ్రంట్ టైర్ లేపి మరీ దూసుకువెళుతున్న అజిత్ స్టిల్ బయటికి వచ్చింది. ప్రస్తుతం వాలిమై షూటింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు. వాలిమై  యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. 

గతంలో అజిత్ వాలిమై షూటింగ్ సెట్స్ లో చిన్న ప్రమాదానికి గురయ్యారు. అయినప్పటికీ అజిత్ వెరవకుండా అలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నారు. దర్శకుడు హెచ్ వినోద్ గత ఏడాది పింక్ రీమేక్ నెర్కొండ పార్వై మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. వరుసగా మరోమారు ఈ కాంబినేషన్ లో వాలిమై తెరకెక్కుతుంది. 

PREV
click me!

Recommended Stories

అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?