స్వర్గీయ బాలుకు ఏపీ ప్రభుత్వ అరుదైన గౌరవం

By team teluguFirst Published Nov 27, 2020, 7:56 AM IST
Highlights

ఎస్పీ బాలు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో గల ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు బాలు పేరు పెట్టనున్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కలచివేసింది. ఆయన మరణించి రెండు నెలలు అవుతున్నా సంగీత ప్రియులను జ్ఞాపకాలు వీడడం లేదు. కరోనా సోకడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో బాలు జాయిన్ అయ్యారు. 50రోజుల సుధీర్ఘ పోరాటం తరువాత బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూయడం జరిగింది. 

కోవిడ్ నెగెటివ్ రావడంతో పాటు, కోలుకొని ఇంటికి వస్తున్నారనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు ఆయనను బ్రతికించడానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చెన్నై శివారులోని తమ ఫార్మ్ హౌస్ లో కుమారుడు ఎస్పీ చరణ్ బాలు అంత్యక్రియలు నిర్వహించారు. 

ఏపీ ప్రభుత్వం బాలు గౌరవార్థం ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కాగా ఎస్పీ బాలు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో గల ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు బాలు పేరు పెట్టనున్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!