పాక్ స్టూడెంట్స్ ఫూల్స్ అయ్యారు.. సమంత, సిద్దార్థ్ జోకులు!

Siva Kodati |  
Published : May 30, 2019, 04:02 PM IST
పాక్ స్టూడెంట్స్ ఫూల్స్ అయ్యారు.. సమంత, సిద్దార్థ్ జోకులు!

సారాంశం

'#pray for nesamani' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ పై సెలబ్రిటీలు సైతం జోకులు పేల్చుతున్నారు. 

'#pray for nesamani' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ పై సెలబ్రిటీలు సైతం జోకులు పేల్చుతున్నారు. అసలు ఇంతకీ ఈ నేసమణి ఎవరో తెలుసుకుందాం. ఈ నెసమణి వల్ల పాకిస్తాన్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులే ఫూల్స్ అయ్యారు. వారి వల్లే ఈ హ్యాష్ ట్యాగ్ ఇంతలా ట్రెండింగ్ లోకి వచ్చింది. 

పాక్ లోని కొందరు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సుత్తి పరికరాన్ని పోస్ట్ చేస్తూ దీనిని మీ దేశంలో ఏమంటారు అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తమిళనాడులోని స్టార్ కమెడియన్ వడివేలు అభిమానులు సరదాగా స్పందించారు. స్టార్ హీరోలు విజయ్, సూర్య కలసి నటించిన ఈ చిత్రంలో వడివేలు కమెడియన్ గా నటించాడు. ఓ సన్నివేశంలో వడివేలు తలపై సుత్తి పడుతుంది. దీనితో అతడు సృహతప్పి పడిపోతాడు. ఈ చిత్రంలో వడివేలు పాత్ర పేరు నేసమణి. 

ఆ దృశ్యాన్ని వడివేలు అభిమానులు పాక్ విద్యార్థులకు ట్యాగ్ చేశారు. పాపం పాక్ స్టూడెంట్స్.. అది సినిమా అని తెలియక నేసమణి అనే వ్యక్తి నిజంగానే పడిపోయాడని భావించారు. నేసమణి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అంటూ #pray for nesamani అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీనితో ఆ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

సమంత, సిద్దార్థ్ లాంటి సెలెబ్రిటీలు కూడా దీనిపై జోకులు వేస్తున్నారు. గాయపడ్డ నేసమణికి తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చింది. త్వరగా సృహలోకి వచ్చేయండి వడివేలు సర్ అని సిద్దార్థ్ చమత్కరిస్తూ ట్వీట్ చేశాడు. ఓబేబి చిత్రంలో సమంత ఏడుస్తున్న ఫోటోని ఆమె అభిమానులు షేర్ చేశారు. దీనిని నేస,మణి హ్యాష్ ట్యాగ్ తో సమంత రీట్వీట్ చేసింది. వడివేలు కార్టూన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా