
శాకుంతలం (Shaakuntalam)మూవీ షూటింగ్ కంప్లీటై చాలా రోజులవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి కనీస అప్డేట్స్ లేవు, సమంత విడాకులు గొడవలో పడి జనాలు కూడా శాకుంతలం సంగతి మర్చిపోయారు. అసలు శాకుంతలం మూవీ ఎంత వరకు వచ్చింది? రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకున్నప్పటికీ అప్డేట్ అయితే ఇచ్చారు గుణశేఖర్. శాకుంతలం నుండి సమంత ఫస్ట్ లుక్ రేపు విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 21న ఉదయం 9:30 నిమిషాలకు శాకుంతలం ఫస్ట్ లుక్ (Shaakuntalam Firstlook)విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గుణశేఖర్ పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక చిత్రం నేపథ్యంలో షూటింగ్ మొత్తం సెట్స్ లోనే కంప్లీట్ చేశారు. చిత్రీకరణ త్వరగా ముగించిన మణిశర్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.
ఇక సమంత ఒక పౌరాణిక పాత్రలో ఎలా ఉంటారు అనే ఆసక్తి అందరిలో కొనసాగుతుంది. గతంలో సమంత ఎన్నడూ ఈ తరహా పాత్ర చేయలేదు. దర్శకుడు గుణశేఖర్ శకుంతలగా ఆమె లుక్ ఎలా డిజైన్ చేశాడో చూడాలి మరి. సీజీ పార్ట్ అధికంగా ఉన్న కారణంగా శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జంటగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తుండగా... గుణ టీం వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ఇక సమంత(Samantha) నటిస్తున్న మరొక చిత్రం యశోద. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటించిన కణ్మణి రాంబో ఖతీజా చిత్రం విడుదల కావాల్సి ఉంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషాల్లో విడుదల కానుంది.