'బాహుబలి' నుంచి 'దేవర' దాకా: 'ధర్మ ప్రొడక్షన్స్' తెలుగు రిలీజ్ లు,రిజల్ట్

By Surya Prakash  |  First Published Oct 2, 2024, 9:27 AM IST

ధర్మ ప్రొడక్షన్స్..  గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రాన్ని నార్త్‌లో విడుదల చేసింది .



పెద్ద తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లో తమ సినిమాలు రిలీజ్ చేయలనే ప్లానింగ్ రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల దృష్టి ఇప్పుడు నార్త్ మార్కెట్ పై పడింది. ఇంతకాలం నార్త్ లో కేవలం యూట్యూబ్ లో తమ సినిమాల డబ్బింగ్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న హీరోలు...తమ సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యి అక్కడ థియేటర్స్ లో ఆడాలని కోరుకుంటున్నారు.  హిందీ మార్కెట్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది కరుణ్ జోహార్..ఆయన డిస్ట్రిబ్యూషన్ సంస్ద ధర్మ ప్రొడక్షన్స్. ఆ సంస్ద రిలీజ్ చేసిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ లు ఏమిటి..వాటి రిజల్ట్ ఏమిటో చూద్దాం. 

ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ లో పాతుకుపోయిన సంస్ద. ఆ సంస్ద ఖాతాలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. కాలంతో పాటు మార్పులు చెందటం, కొత్త కొత్త ప్రమోషన్ స్కీమ్ లు వేసి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటం, స్టార్స్ వారసులను తెరకు పరిచయం చేయటం,ముఖ్యంగా సినిమాకు పీ.ఆర్ అందించటంతో ధర్మ ప్రొడక్షన్స్ కు మించిన వాళ్లు లేరు అన్న పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్యాన్ ఇండియా కాన్సెప్టు ని సైతం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సౌత్ సినిమాలను నార్త్ ప్రేక్షకులకు అందించటంలో సక్సెస్ అవుతోంది ఈ బ్యానర్.  

బాహుబలితో మొదలై దేవర దాకా ధర్మ ప్రొడక్షన్స్ లాభాల పంట

Latest Videos

undefined

ధర్మ ప్రొడక్షన్స్..  గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రాన్ని నార్త్‌లో విడుదల చేసింది . కరణ్ జోహార్‌ (Karan Johar)కి చెందిన ఈ నిర్మాణ సంస్థ.. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్‌ని ఒక్కసారిగా ‘బాహుబలి’తో సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ అవ్వటం కలిసొస్తోంది.  ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 చిత్రం కలెక్షన్స్ అయితే షాక్ ఇచ్చాయి. 500 కోట్లు దాటిన మొదటి హిందీ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  దాంతో కరణ్ జోహార్ దృష్టి పూర్తిగా సౌత్ ఇండియన్ సినిమాల డబ్బింగ్ పై పడింది.

ధర్మ ప్రొడక్షన్స్ కు కలిసొచ్చిన తెలుగు సినిమాలు


ఆ తరువాత రానా నటించిన  ‘ఘాజి’ని కూడా రిలీజ్ చేసి సూపర్ హిట్టుని అందుకుంది ధర్మా ప్రొడక్షన్ హౌస్. ఆ తర్వాత  Robot 2.0 సినిమా సైతం నార్త్ లో రిలీజ్ చేస్తే మంచి లాభాలు తెచ్చిపెట్టింది.  అలాగే ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఈ సంస్థే నిర్మించింది. అయితే  ‘లైగర్’ (Liger)సినిమా నార్త్ లోనూ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి హిందీ ఆడియన్స్ ని అలరించి బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని ప్లాన్ చేసి రైట్స్ తీసుకున్నారు. 

దేవరకు నార్త్ బెల్ట్ లో అదే ధైర్యం

ధర్మ ప్రొడక్షన్స్  ప్రొడక్షన్ నుంచి దేవర రిలీజ్ అవ్వడం ఎంతో ప్రాఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నిర్మాణ సంస్థ ద్వారా నార్త్ లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ గ్రాండ్ రిలీజ్ వల్ల భారీ వసూళ్లు నమోదు కాలేదు కానీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మెల్లిమెల్లిగా నిలుదొక్కుకుంది.  ఇక నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే ధైర్యం వస్తోంది.  థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేసింది. యావరేజ్ టాక్ వచ్చినా చాలు..కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.


హిందీ డబ్బింగ్ వెర్షన్ వీకెండ్ లో ఎలా పికప్ అయ్యిందంటే...


తన మొదటి ప్రయత్నం లోనే తారక్ హిందీ మార్కెట్ లో  సాలిడ్ వసూళ్లు అందుకున్నాడని చెప్పాలి. అలా మొదటి వీకెండ్ సాలిడ్ నంబర్స్ సెట్ చేసిన దేవర మొదటి సోమవారం కూడా నిలకడ చూపించినట్టుగా బాలీవుడ్ ట్రేడ్ చెబుతుంది. ఇలా వర్కింగ్ డే సోమవారం నాడు దేవర ఇంట్రెస్టింగ్ గా 4 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఇలా నాలుగో రోజుకి 4.4 కోట్లు నెట్ వసూళ్లు టచ్ చేసి మొత్తం నాలుగు రోజుల్లో దేవర 34 కోట్ల మేర వసూళ్లు అందుకుంది. దీనితో హిందీలో మాత్రం దేవర సాలిడ్ గా నిలబడ్డాడు అని చెప్పాలి.

శుక్రవారం - 7.50 crore nett

శనివారం  - 8.75 crore nett

ఆదివారం - 10.25 crore nett

టోటల్  - 26.50 crore nett


త్రివిక్రమ్ చెప్పిందే దేవరకు జరుగుతోంది


రీసెంట్‌గా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram).. ‘దేవర’ (Devara)ను ఉద్దేశించి ‘దేవర’ నామ సంవత్సరం మొదలైందని అన్నారు. అన్నట్లుగానే.. నిజంగానే ఈ సంవత్సరం ‘దేవర’ నామ సంవత్సరంగా మారుతోంది.  భారీ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఐదు  రోజుల రన్ ని అయితే పూర్తి చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెవర్ బిఫోర్ నంబర్స్ ని సెట్ చేస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. తన కెరీర్ 30వ సినిమాగా అది కూడా సోలోగా తన నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు సెట్ అయ్యి రిలీజ్ కి ఈ చిత్రం వచ్చింది.   ఈ చిత్రాన్ని  నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసారు.

 

 

click me!