అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తుందని ముందే చెప్పిన రష్మిక 

Published : Aug 27, 2023, 04:17 PM IST
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తుందని ముందే చెప్పిన రష్మిక 

సారాంశం

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఖాయమని గతంలో రష్మిక మందాన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.   

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 24న భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. 11 విభాగాల్లో టాలీవుడ్ కి అవార్డులు దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీకి 6 అవార్డులు వచ్చాయి. పుష్ప చిత్రానికి 2 అవార్డులు దక్కాయి. కొండపొలం, ఉప్పెన చిత్రాలు నేషనల్ అవార్డ్స్ గెలుపొందాయి. 

అల్లు అర్జున్ గెలుచుకున్న ఉత్తమ నటుడు అవార్డు చాలా ప్రత్యేకం. టాలీవుడ్ చరిత్రలో ఏ నటుడు కూడా నేషనల్ అవార్డు గెలవలేదు. 2021లో విడుదలైన పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్ రోల్ చేశారు. డీగ్లామర్ రోల్ లో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కైవశం చేసుకున్నాడు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. అభిమానులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తుందని హీరోయిన్ రష్మిక మందాన ముందే చెప్పింది. పుష్ప సక్సెస్ మీట్లో మాట్లాడిన రష్మిక మందాన... అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుతో పాటు పలు అవార్డులు వస్తాయి. ఈ చిత్రం కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. కేవలం మేకప్ కోసమే మూడు గంటల సమయం పట్టేది. ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రాకపోతే మొదట బాధపడేది నేనే అని ఆమె అన్నారు. 

రష్మిక ఊహించినట్లే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో రష్మిక ముందే చెప్పిదంటూ పాత వీడియో వైరల్ చేస్తున్నారు. పుష్ప లో రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. 2024 సమ్మర్ కానుకగా పుష్ప 2 విడుదల కానుందని సమాచారం. పుష్ప సిరీస్ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్