
బాలయ్యతో బోయపాటి సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే.. యాక్షన్ లవర్స్ అయితే జాతర చేసుకుంటారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించిన ఈసినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిందీ సినిమా. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఈసినిమాలో రైతుగా, అఘోరాగా రెండు పాత్రల్లో బాలయ్య నటన అద్భుతం అని చెప్పాలి. ఇక రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండ ఎంత గొప్ప అఖండ విజయం అందుకుందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈసినిమాకు సీక్వెల్ వస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఓ సారి బోయపాటి ఈ సినిమాపై క్లారిటీ కూడా ఇచ్చాడు. వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ సినిమాలు పడటంతో.. నాలుగో సినిమాగా అఖండ కు సీక్వెల్ ను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట బాలయ్య, బోయపాటి. ఈక్రమంలో ఈసినిమాపై తాజాగా క్లారిటీతో పాటు మరోసారి అప్ డేట్ ఇచ్చాడు బోయపాటి.
ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేని తో బోయపాటి శ్రీను స్కంద మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా స్కంద భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా నిన్న ( అగస్ట్ 26) జరిగిన ప్రీ రిలీజ్ వేడుకల్లో బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా సందడి చేశారు. ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. రామ్ ను ఆట్టపటించారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. స్కంద హడావిడి అయిపోగానేు బాలయ్య బాబుతో సినిమా చేస్తాను అని అన్నారు. అదిక అఖండ 2 మూవీ ఉంటుందని, ప్రస్తుతం దానికి సంబంధించి ప్లానింగ్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడి అవుతాయని అన్నారు.
బోయపాట వాఖ్యలతో అఖండ 2 మూవీ త్వరలో పక్కాగా రానుందని క్లారిటీ వచ్చేసింది. షూటింగ్ కూడా ఈ ఏడాది స్టార్ట్ అవుతుందనిక్లారిటీ వచ్చేసింది. దాంతో అఖండా సీక్వెల్ అంతకు మించి ఉండబోతున్నట్టు కూడా క్లారిటీ ఉంది. దాంతో ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఆమూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు.