హెబ్బాప‌టేల్ కూడా అంతేనా

Published : Mar 13, 2017, 02:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
హెబ్బాప‌టేల్ కూడా అంతేనా

సారాంశం

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేద్ద‌మ‌ని అనుకుంటున్న హెబ్బా ప‌టేల్ ఇలియాన కాజ‌ల్ త‌మ‌న్నలాగ హింది సినిమాల్లో న‌టించాల‌ని చూస్తున్న బ్యూటి

 

నిజానికి టాలీవుడ్ లో హెబ్బాకు బ్లాక్ బస్టర్ మూవీస్ లేవు. కుర్రహీరోలతో ఓ మోస్తరు హిట్స్ మాత్రమే కొట్టింది. నటిగా ఆమె ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయి. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. హెబ్బా మాత్రం ఇప్పటివరకు సంపాదించిన అనుభవం తనకు చాలంటోంది. కుదిరితే ఈ ఏడాదే బాలీవుడ్ లో అడుగుపెట్టాలని తహతహలాడుతోంది. ఈ మేరకు తనకు తెలిసిన బాలీవుడ్ సర్కిల్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోందట.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా త్వరలోనే బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ ఊరించింది ఈ చిన్నది. ఆ బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ సినిమా అవకాశమే అయి ఉండొచ్చని టాక్. అయినా హిందీ చిత్రసీమకు వెళ్లిన ఇలియాన, తాప్సి లాంటి తారల కెరీర్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి కూడా ఇంకా బాలీవుడ్ కలలుకంటున్న హెబ్బాను ఏమనాలి..

PREV
click me!

Recommended Stories

Anali OTT Release: కోర్టు స్టేతో ఆగిపోయిన క్రైమ్ సిరీస్, అనలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
Wild Card Entry List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్‌ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే