అమేజాన్ ప్రైమ్ హెడ్ రాజీనామా, ఆ సూపర్‌ స్టార్ హీరో ప్రొడక్షన్ లోకి ఎంటర్‌?

By Surya PrakashFirst Published May 11, 2024, 9:40 AM IST
Highlights

'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్', 'పాతాల్ లోక్', 'మేడ్ ఇన్ హెవెన్',  'ఫర్జీ' వంటి  వెనుక క్రియేటివ్ మైండ్ పురోహిత్ అనేది నిజం.

అమేజాన్ ప్రైమ్  ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ రాజీనామా చేయటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రైమ్ వీడియో లో పని చేస్తున్నారు. ఓ రకంగా ఈ  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఇండియాలో లాభాలు బాట పట్టించటంలో ఆమె తనవంతు కృషి చేసింది.  అమేజాన్ లో సూపర్ హిట్ సీరిస్ లు అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్', 'పాతాల్ లోక్', 'మేడ్ ఇన్ హెవెన్',  'ఫర్జీ' వంటి  వెనుక క్రియేటివ్ మైండ్ పురోహిత్ అనేది నిజం. దాంతో ఆమె అమేజాన్ ని వదిలి వెళ్లిపోతోంది అనేది అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు  అపర్ణ పురోహిత్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో చేరుతున్నట్లు సమాచారం. ఇక పురోహిత్ గురించి అమేజాన్ స్పోక్స్ పర్శన్ మాట్లాడుతూ..."గత ఎనిమిది సంవత్సరాలుగా అపర్ణ..అమేజాన్ ప్రైమ్ సంస్దలో చేసిన కృషి అపారం. జనాలకి నచ్చి,గుర్తు పెట్టుకునే అమేజాన్ ఒరిజనల్స్ ని ఆమె గుర్తించి ఎంపిక చేసి స్ట్రీమ్ చేసారు. అమేజాన్ ప్రైమ్ లో కంటెంట్ వైవిద్యంగా ఉండటానికి ఆమె ఓ డ్రైవింగ్ ఫోర్స్ లా పనిచేసారు. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్, తెర వెనక మహిళలు పాత్ర ఎక్కువ  ఉండేలా ఆమె కృషి చేసారు " అన్నారు. 

Latest Videos

ప్రైమ్ వీడియోలో జాయన్ అవ్వటానికి ముందు పురోహిత్ ...ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన విభాగాల్లో పనిచేసారు. సినీ స్ధాన్ ఫిల్మ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా ముంబైలో కెరీర్ మొదలెట్టారు. మహేంద్ర  & మహేంద్ర వారి ముంబై మంత్ర మీడియా లిమిటెడ్ లోనూ ఆమె పనిచేసారు. నేషనల్ ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ వారి ఫిల్మ్ బజార్ ప్రాజెక్టుకు పనిచేసారు. రిలియన్స్ బిగ్ ఎంటర్ట్నైంట్స్ లోనూ, బిగ్ పిక్చర్స్ లోనూ, యుటీవి మోషన్ పిక్చర్స్ లోనూ పనిచేసారు.  

 2008లో ఆమె ముంబై వచ్చినప్పుడు తన కల ఓ డైరక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని. డిల్లీలో మాస్ కమ్యూనికేషన్ చదువుకున్న ఆమె తెరపై కథలు చెప్పాలనే తన కోరికను ఇన్నాళ్లకు తీరే అవకాసం వస్తోందంటున్నారు. నా లాంటి కొత్త దర్శకుల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని నమ్ముతున్నారు అన్నారామె. 
 

click me!