Robbie Coltrane Death : ‘హ్యారీ పోటర్’ నటుడు కన్నుమూత.. హాలీవుడ్ ప్రముఖుల సంతాపం.!

Published : Oct 15, 2022, 12:18 PM ISTUpdated : Oct 15, 2022, 12:20 PM IST
Robbie Coltrane Death : ‘హ్యారీ పోటర్’ నటుడు కన్నుమూత.. హాలీవుడ్ ప్రముఖుల సంతాపం.!

సారాంశం

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రెన్ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   

చిత్ర పరిశ్రమ నుంచి మరో ఆణిముణ్యం నింగికెగిసింది. పాపులర్ సిరీస్ ‘హ్యారీ పోటర్’ (Harry Potter) నటుడు రాబీ కోల్ట్రెన్ (Robbie Coltrane) తుది శ్వాస విడిచారు. ఆయన 72వ ఏట కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.  ఆయన మరణవార్తను కోల్ట్రెన్ ఏజెంట్ బెలిందా రైట్ అధికారికంగా ప్రకటించారు. ‘రాబీ అద్భుతమైన నటుడే కాకుండా, లా పరంగా కూడా  ప్రావీణ్యుడని, ఆయన్ని ఎన్నటికీ మరవబోమని’ ఏంజెట్ బెలిందా భావోద్వేగమయ్యారు. అయితే రాబీ మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. 

రాబీ స్కాట్ ల్యాండ్ కు దేశస్తుడు. 1950 మార్చి 30న జన్మించాడు. ప్రస్తుతం స్కాట్ ల్యాండ్ లోనే నివసిస్తున్నాడు. 1978 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ ఉన్నారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘క్రాకర్’ ద్వారా  నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2001 మరియు 2011 మధ్య విడుదలైన మొత్తం ఎనిమిది ‘హ్యారీ పాటర్’ చిత్రాలలో బాయ్ మాంత్రికుడు హ్యారీ పోటర్‌కు మెంటర్ అయిన హాఫ్-జెయింట్ హాగ్రిడ్‌ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నాడు. ఇందులో నటించినందుకు  మూడుసార్టు ఉత్తమ నటుడిగా బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డులను  అందుకున్నారు. 

అంతేకాకుండా రాబీ కోల్ట్రేన్ తన  కేరీర్ లో ‘జేమ్స్ బాండ్, గోల్డెన్ ఐ, ది వరల్డ్’ వంటి పలు చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. రాబీ చివరిగా ‘హ్యారీ పాటర్’ 20వ వార్షికోత్సవంలో కనిపించాడు. ఆరోగ్యం సహకరించక రెండేండ్ల నుంచి నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం అభిమానులను బాధిస్తోంది. మరోవైపు హాలీవుడ్ ప్రముఖులు కూడా రాబీ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన