పవన్‌ ని పక్కన పెట్టిన హరీష్‌ శంకర్‌.. రవితేజతో సినిమా ? ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్‌

Published : Jul 17, 2023, 03:19 PM IST
పవన్‌ ని పక్కన పెట్టిన హరీష్‌ శంకర్‌.. రవితేజతో సినిమా ? ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్‌

సారాంశం

ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వారాహియాత్ర చేస్తూ ఆయన తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలకు టైమ్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. `బ్రో` సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. మరోవైపు `ఓజీ` సినిమా సగానికిపైగానే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మరో 20 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే ఆయన పార్ట్ పూర్తవుతుందని తెలుస్తుంది. హరీష్‌ శంకర్‌తో చేస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా ఒకటి రెండు షెడ్యూల్‌ మాత్రమే పూర్తయ్యింది. ఇప్పటికే చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్‌ చేశారు. అది సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వారాహియాత్ర చేస్తూ ఆయన తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలకు టైమ్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఇచ్చినా ఆయన `ఓజీ`కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా చేస్తారు. కానీ ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావడం కష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల తర్వాతే అనే ఓ వార్త వినిపిస్తుంది. దీంతో ఈ సినిమాని హరీష్‌ శంకర్‌ పక్కన పెట్టబోతున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

పవన్‌ సినిమాని పక్కన పెట్టి మరో సినిమా చేయాలనుకుంటున్నారు. మాస్‌ మహారాజా రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హిందీలో అజయ్‌ దేవగన్‌ నటించిన `రైడ్‌` సినిమాని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్లాన్‌లో ఉంది. ఈ సినిమాని రవితేజ హీరోగా చేయాలనుకుంటున్నారని, దీనికి హరీష్‌ శంకర్‌ని దర్శకుడిగా తీసుకోబోతున్నారట. అలా పవన్‌ని పక్కన పెట్టి రవితేజతో సినిమాకి హరీష్‌ రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

అజయ్‌ దేవగన్‌` నటించిన `రైడ్‌` సినిమా ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారి ఆటుపోట్ల నేపథ్యంలో సాగుతుంది. నిజాయితీ గల ఇన్‌కమ్‌ టాక్స్ ఆఫీసర్‌ కి వృత్తి రీత్యా ఎదురైన సవాళ్లని ఎలా ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందింది. బాలీవుడ్‌లో పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. రవితేజ నటిస్తారని సమాచారం. దర్శకుడిగా హరీష్‌ పేరు వినిపిస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాప్రస్తుతం రవితేజ.. `టైగర్‌నాగేశ్వరరావు`, `ఈగల్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?