మ్యూజిక్ లవర్స్ పై పగబట్టిన బాలయ్య... ఒకరిద్దరన్నా ప్రాణ త్యాగం చేయాలేమో! 

Published : Jan 23, 2023, 11:10 AM ISTUpdated : Jan 23, 2023, 11:17 AM IST
మ్యూజిక్ లవర్స్ పై పగబట్టిన బాలయ్య... ఒకరిద్దరన్నా ప్రాణ త్యాగం చేయాలేమో! 

సారాంశం

వేదికలపై తన సినిమా పాటలు పాడటం అలవాటుగా పెట్టుకున్న బాలయ్య ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాడు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మరోసారి సింగింగ్ టాలెంట్ చూపించారు. 

నచ్చిన పని చేయడం తప్పులేదు. అదే సమయంలో అసలు ఏమాత్రం రాని పనులు చేయడం కూడా సరికాదు. బాలకృష్ణ మంచి నటుడు, డైలాగ్ డెలివరీలో కింగ్. ఓ తరహా డైలాగ్స్ చెప్పాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. అయితే బాలయ్య సింగర్ కూడా నిరూపించుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో సంగీత ప్రియుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. సంగీతంలో కనీస ప్రావీణ్యం, ప్రవేశం ఉండి వేదికలపై పాడితే అర్థం పరమార్థం. సంగీత జ్ఞానం లేకపోయినా చక్కగా అనుకరించి పాడే టాలెంట్ అన్నా ఉండాలి. బాలయ్యలో ఆ రెండూ లేవు. 

జగదేకవీరుని కథ మూవీలో ఘంటసాల పాడిన 'శివ శంకరీ' ఎవర్ గ్రీన్ క్లాసిక్. ప్రొఫెషనల్ సింగర్స్ కూడా ఆ పాట జోలికి పోరు. సంగీతంలో పండిపోయిన ఉద్దండులు మాత్రమే సదరు పాటకు న్యాయం చేయగలరు. ఆ పాట పాడటం బాలయ్యకు అవసరమా చెప్పండి. నా పుట్టినరోజు గిఫ్ట్ అంటూ... తన కర్ణ కఠోర స్వరంతో శివ శంకరీ సాంగ్ కిచిడీ కిచిడీ చేసి జనాల మీదకు వదిలాడు. బాలయ్య పాడిన శివ శంకరీ సాంగ్ విన్నాక మ్యూజిక్ లవర్స్ కి రెండు రోజులు నిద్ర పట్టలేదు. 

వేదికలపై తన సినిమా పాటలు పాడటం అలవాటుగా పెట్టుకున్న బాలయ్య ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాడు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మరోసారి సింగింగ్ టాలెంట్ చూపించారు. పాటలో శృతి సంగతి దేవుడెరుగు బాలయ్య స్వరం నుండి జాలువారిన చరణాలు, పల్లవులు పచ్చడైపోయాయి. జనాలు వినలేక ఎక్కడ పలాయనం చేస్తారోనని ఈవెంట్ ఆర్గనైజర్స్ టెన్షన్ తో చచ్చిపోయారు.  ఎందులోనైనా మేమే గొప్పనే బాలయ్య బడాయిల పైత్యం తెలుగు జనాలకు తెలుసు కాబట్టి సమస్య లేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన హనీ రోజ్ మాత్రం కంగుతిని ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ మధ్య పూరి జగన్నాథ్ పైసా వసూల్ మూవీలో బాలయ్యతో ఓ పాట పాడించారు. ఆ దెబ్బతో బాలయ్యలో కాన్ఫిడెన్స్ లెవల్స్ మరింత పెరిగాయి. 

సమస్య ఏంటంటే బాలయ్యకు ఇది తప్పు అని చెప్పే నాథుడు ఈ ప్రపంచంలో లేడు. నువ్వు పాడితే బాగోలేదని చెబితే వాడి చెంప పగులుద్ది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాలయ్య గాన కచేరీలు ఎన్నో అనుభవించాల్సిందే. ఇక సంగీత ప్రియులపై పగబట్టిన బాలయ్య కావాలనే ఇదంతా చేస్తున్నారని జనాలు వాపోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు