స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. అంతేకాదు రెండు భారీ సినిమాలను సెట్ చేశాడట. ఇద్దరు బిగ్ స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనతో చేయాల్సిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ షూటింగ్‌ని వాయిదా వేశారు. పవన్ ఫ్రీ అయ్యాక ఆ మూవీ చేయనున్నారు. ఈ లోపు రవితేజతో `మిస్టర్ బచ్చన్` మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలీవుడ్‌లో వచ్చిన `రైడ్` మూవీకిది రీమేక్ అని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మరో ఇద్దరు బిగ్ స్టార్స్ ని పట్టుకున్నాడు. ఆయన టాలీవుడ్ సీనియర్లతో సినిమాలు అవకాశాలను అందుకున్నారు. ఇటీవల ఆయన `ఈగల్` సక్సెస్ మీట్ లో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నా, త్వరలో మరో ఇద్దరు హీరోలతో సినిమాలు చేయబోతున్నా అని ప్రకటించారు. తనపై వచ్చే నెగటివ్ వార్తలకు సమాధానంగా ఆయన స్పందించారు.
అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఆ ఇద్దరు స్టార్లకి సంబంధించిన పుకార్లు వినిపించాయి. వాళ్లు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ ఇద్దరితో నెక్ట్స్ హరీష్ శంకర్ సినిమాలు చేయబోతున్నారట. చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు హరీష్ శంకర్ అని తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం.
మరోవైపు బాలకృష్ణతోనూ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే కథా చర్చలుజరిగాయట. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 మూవీ చేస్తున్నారు. అనంతరం బోయపాటితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాతి మూవీ హరీష్ తో ఉండబోతుందట. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్ హౌజ్ నిర్మించబోతుందని తెలుస్తుంది.
ఇలా హరీష్ శంకర్ నెక్ట్స్ క్రేజీ లైనప్‌ని సెట్ చేశాడని చెప్పొచ్చు. అంతేకాదు ఫస్ట్ టైమ్ ఈ సీనియర్ స్టార్స్ ని డీల్ చేయబోతున్నారు హరీష్. దీంతో ఇది మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
also read: Rakul Preet Wedding : వారం రోజుల్లో రకుల్ పెళ్లి.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన స్టార్ హీరోయిన్!