పవన్ తో సినిమాపై హరీష్ ఇలా అన్నాడేంటి!

Published : Sep 16, 2019, 05:08 PM IST
పవన్ తో సినిమాపై హరీష్ ఇలా అన్నాడేంటి!

సారాంశం

గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు హరీష్ శంకర్. అటు పవన్ కళ్యాణ్ కెరీర్ కు, హరీష్ కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. వీరిద్దరి క్రేజీ కాంబోలో మరో చిత్రం రావాలని అభిమానులు కోరుకోవడం సహజమే. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేనానిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాల్లోకి కొనసాగాలని కోరుకునే అభిమానులు ఉన్నారు.. అలాగే రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ జనసేన వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. 

ఇటీవల వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు పదే పదే పవన్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నలు సంధించారు. 

అభిమానుల అత్యుత్సాహంపై హరీష్ శంకర్ స్పందన ఆసక్తికరంగా ఉంది. మీరు విజిల్స్ వేసి, కేకలు పెడితే కుదరదు. అది జరగాలని అభిమానులంతా బలంగా కోరుకోండి.. అయిపోద్ది అని హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు. అంటే ఇప్పటికీ హరీష్ పవన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తుంటే హరీష్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటని అంతటా చర్చ జరుగుతోంది.  

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?