బిజీగా మారిన కియారా.. స్టార్ హీరోలని కూడా పట్టించుకోవడం లేదు!

Published : Sep 16, 2019, 04:59 PM IST
బిజీగా మారిన కియారా.. స్టార్ హీరోలని కూడా పట్టించుకోవడం లేదు!

సారాంశం

ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా, ప్రియాంకా లాంటి స్టార్ హీరోయిన్లు అవుట్ డేట్ అయిపోతుండడంతో కియారా వారికొక ఆప్షన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నాలుగు హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది.    

తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న కియారా ఆ తరువాత 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ సరసన నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో బిజీగా మారింది. ఇటీవల ఆమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కియారా క్రేజ్ బాగా పెరిగింది.

దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా, ప్రియాంకా లాంటి స్టార్ హీరోయిన్లు అవుట్ డేట్  అయిపోతుండడంతో కియారా వారికొక ఆప్షన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నాలుగు హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది.  అక్షయ్‌ కుమార్‌తో 'గుడ్‌ న్యూస్‌', సిద్ధార్థ్‌ మల్హోత్రాతో 'షేర్షా' చిత్రం చేస్తోంది.

అక్షయ్‌ కుమార్‌తోనే కాంచన రీమేక్‌ అయిన 'లక్ష్మీ బాంబ్‌'లో కూడా ఛాన్స్ దక్కించింది. ఈ సినిమాలు కాకుండా 'ఇందు కీ జవానీ' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఎలాంటి పాత్రకైనా అమ్మడు వంకలు పెట్టకుండా నటించడం, బోల్డ్ సీన్స్ కి కూడా సై అనడం, బికినీలు వేయడానికి అభ్యంతరాలు చెప్పకపోవడంతో అందరి దృష్టి కియారాపై పడింది.

దీంతో అమ్మడు సౌత్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. స్టార్ హీరోల సినిమాలకు డేట్స్ అడుగుతున్నా.. కుదరదని చెప్పేస్తుందట. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించడానికి ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. కియారా మాత్రం కాల్షీట్స్ బిజీ అని చెబుతుందట. మొత్తానికి కియారా బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. 
 

PREV
click me!

Recommended Stories

Silk Smitha: చనిపోయే ముందు సిల్క్ స్మిత ఫోన్ చేసింది, నేను వెళ్లి ఉంటే బతికేదేమో.. సీనియర్ నటి ఆవేదన
కృష్ణ, ఎన్టీఆర్ నుంచి రాంచరణ్, రవితేజ వరకు.. క్రేజీ హీరోలు ప్రాణం పెట్టి నటించిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు