రవితేజ `రావణాసుర` రీమేక్‌ సినిమానా?.. హాట్‌ టాపిక్‌

Published : Apr 04, 2023, 08:16 PM IST
రవితేజ `రావణాసుర` రీమేక్‌ సినిమానా?.. హాట్‌ టాపిక్‌

సారాంశం

రవితేజ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ `రావణాసుర` ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. అయితే ఇది రీమేక్‌ సినిమా అనే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ `రావణాసుర`. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఐదుగురు హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రీమేక్‌ అని తెలుస్తుంది. 

`రావణాసుర`.. నాలుగేళ్ల క్రితం బెంగాలీలో వచ్చిన `విన్సి డా` చిత్రానికి రీమేక్‌ అని తెలుస్తుంది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుద్రానిల్‌ ఘోస్‌, రిత్విక్‌ చక్రబోర్తి, సోహిని సర్కార్‌, అనిర్బన్‌ భట్టాచార్య, రిద్ది సేన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలుకుంది. ఈ సినిమాని `రావణాసుర`గా తెలుగులో రీమేక్‌ చేసినట్టు సమాచారం. అయితే ఈ రీమేక్‌ రైట్స్ కొనే రీమేక్‌ చేశారని, కాకపోతే చాలా మార్పులు చేసినట్టు సమాచారం. 

మాతృకలో.. ఓ మేకప్‌ ఆర్టిస్ట్ అనుకోకుండా మర్డర్‌ కేసులో ఇరుక్కోవడం, ఆ ఆర్టిస్టుని తయారు చేసిన మేకప్‌తో ఓ పాపులర్‌ లాయర్‌ నేరాలకు పాల్పడటం, అతను నేరాలకు పాల్పడం వెనకాల ఉన్న కారణాలతో `విన్సి దా` చిత్రం రూపొందిందని తెలుస్తుంది. ఇక రవితేజ నటించిన `రావణాసుర` కథ కూడా ఇంచు మించు అలానే ఉంది. ఆయన పాపులర్‌ లాయర్‌. చట్టాలను అడ్డుపెట్టుకుని ఆయన నేరాలకు పాల్పడుతుంటాడు. ఆయన క్రిమినల్‌గా ఎందుకు మారాడనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ముందు నుంచి విలన్‌గా కనిపించే పాత్రలన్నీ చివర్లో విలన్లుగా, విలన్‌గా కనిపించే పాత్రలన్నీ చివర్లో హీరోలుగా కనిపిస్తాయని సమచారం.

అయితే ఈ సినిమా `విన్సి దా` రీమేక్‌ అనే వార్తలపై దర్శకుడు సుధీర్‌వర్మ స్పందించారు. ఇది రీమేక్‌ కాదని వెల్లడించారు. బెంగాలీ సినిమాకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ సినిమా చూసి, ఈ సినిమా చూడండి అని, పోలిక కనిపిస్తే చెప్పండంటూ ఆయన వెల్లడించారు.  ఏది నిజమనేది ఏప్రిల్‌ 7న తేలనుంది. ఈ సినిమా ఏడున రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో చాలా థ్రిల్లింగ్‌ పాయింట్లు, ట్విస్టులుంటాయని, అవి థియేటర్లో ఫుల్‌ కిక్‌నిస్తాయని అన్నారు దర్శకుడు సుధీర్‌ వర్మ. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ