పవన్‌ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసిన `హరిహర వీరమల్లు` టీమ్‌, `మాట వినాలి` పాట వాయిదా!

By Aithagoni Raju  |  First Published Jan 5, 2025, 6:36 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి మొదటి పాట విడుదల చేస్తామని టీమ్‌ తెలిపింది. కానీ సడెన్‌గా షాకిచ్చింది. నిరాశ పరిచే వార్తని వెల్లడించింది. 
 


పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం అధికారిక పనులతో బిజీగా ఉంటూనే ఒప్పుకున్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కమిట్‌ అయిన `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు చేయాల్సి ఉంది.

వీటిలో ముందుగా `హరిహర వీరమల్లు` మూవీని కంప్లీట్‌ చేయబోతున్నారు. మరో పది రోజుల షూటింగ్లో పాల్గొంటే ఈ మూవీ పూర్తవుతుందని ఇటీవల పవన్‌ తెలిపారు. మొదట ఈ సినిమానే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

Latest Videos

పవన్‌ ఫ్యాన్స్ కి డిజప్పాయింట్‌ న్యూస్‌..

ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 6న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. `మాట వినాలి` అంటూ సాగే పాటని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా పాడటం విశేషం. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటని రేపు ఉదయం విడుదల చేయాల్సి ఉంది.

దీంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి సర్‌ప్రైజ్‌లు లేక నిరాశతో ఉన్న ఫ్యాన్స్ ఇక ఫస్ట్ సాంగ్‌ వస్తుందని చెప్పి ఎంతో ఆతృతగా ఉన్నారు. కానీ వారికి డిజప్పాయింట్‌ న్యూస్‌ ఇచ్చింది టీమ్‌. పాటని వాయిదా వేసి షాకిచ్చింది. 

read more: నా జీవితాన్ని నాశనం చేశాడు, త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్‌ కౌర్‌ ఆరోపణలు.. `మా` కౌంటర్

`హరిహర వీరమల్లు` లోని మాట వినాలి పాట వాయిదా..

`హరిహర వీరమల్లు` సినిమా నుంచి `మాట వినాలి` అనే పాటని రేపు విడుదల చేయడం లేదు అని తెలిపింది. పాట రాబోతుందని తెలియజేయడంతో మీ నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాం. మీ ప్రేమకి ఫిదా అయిపోయాం. ఈ నేపథ్యంలో మరింత బాగా పాటని తీసుకురావాలనుకుంటున్నాం. అందుకే ఇంకొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం.

పాట విడుదలని వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌,టైమ్‌ని ప్రకటిస్తామని తెలిపింది టీమ్‌. కచ్చితంగా మీ వెయిటింగ్‌కి తగ్గ ఫలితం ఉంటుందని, అంతగా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుందని నమ్ముతున్నామని తెలిపింది. సంగీత తుఫాను కోసం వెయిట్ చేయాలని, అది మీ హృదయాలను తాకుతుందని చెప్పింది. 

బందిపోటుగా పవన్‌ కళ్యాణ్‌..

దీంతో పవన ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారు. పాట వస్తే బాగా సెలబ్రేట్‌ చేయాలని, సోషల్‌ మీడియాని షేక్‌ చేయాలని వాళ్లంతా భావించారు. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో నిరాశ చెందుతున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

We are overwhelmed by the incredible response and love you have shown towards the announcement of our first single “Maata Vinali” from . However to make sure we bring you the very best version of the song, we’ve decided to give it a little extra time before we…

— Hari Hara Veera Mallu (@HHVMFilm)

ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. బాబీ డియోల్‌ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మార్చిలో విడుదల కాబోతుంది. బ్రేక్ తర్వాత, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్‌ నుంచి రాబోతున్న సినిమా ఇది కావడం విశేషం. పీరియడ్‌ నేపథ్యంలో హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బందిపోటు వీరమల్లుగా పవన్‌ కనిపిస్తారు. రాజు ఔరంగాజేబుగా బాబీ డియోల్‌ కనిపిస్తారట. 

read more: చిరంజీవి, మోహన్‌బాబులకు దిమ్మతిరిగే కౌంటర్‌, తనకు తాను `లెజెండ్‌`గా ప్రకటించుకున్న బాలకృష్ణ
 

click me!