
ఇటీవల కాలంలో థియేటర్లలో మామూలుగా ఆడిన చిత్రాలు ఓటీటీలో మాత్రం విశేష ఆదరణ పొందుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. రికార్డు వ్యూస్ సాధిస్తూ మేకర్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
అలాంటి చిత్రాల్లో పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన `ఒక పథకం ప్రకారం` మూవీ ఒకటిగా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో విశేష ఆదరణతో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఒక పథకం ప్రకారం' చిత్రానికి వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు.
ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది.
థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న 'ఒక పథకం ప్రకారం' జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. '
ఒక పథకం ప్రకారం' సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. 'ఒక పథకం ప్రకారం'లో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో సాయిరామ్ శంకర్ నటించారు.
విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా.
ఓటీటీలో ఈ మూవీకి విశేష ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ, `మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది.
థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణకి చాలా థాంక్స్.
ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ తోపాటు చిత్ర బృందం అందరికీ థాంక్స్` అని చెప్పారు.
శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి.. ఛాయాగ్రహణం: రాజీవ్ రాయ్, సంగీతం: రాహుల్ రాజ్, ఆర్.ఆర్: గోపి సుందర్, ఎడిటింగ్: కార్తీక్ జోగేష్, ఆర్ట్; సంతోష్ రామన్, లిరిక్స్: రహమాన్,
సింగర్: సిడ్ శ్రీరామ్, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, సహనిర్మాతలు: జీను మల్లి - స్వాతి కల్యాణి, బ్యానర్స్: వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రయివేట్ లిమిటెడ్, నిర్మాతలు: వినోద్ విజయన్ - గార్లపాటి రమేష్, కథ - స్క్రీన్ ప్లే - సంభాషణలు - దర్శకత్వం: వినోద్ విజయన్.