గూగుల్‌ చేసి హీరోయిన్‌.. `మిణుగురులు` అరుదైన ఘనత.. `షరతులు వర్తిస్తాయి` కోసం శేఖర్‌ కమ్ముల..

By Aithagoni RajuFirst Published Jan 30, 2024, 10:49 PM IST
Highlights

గూగుల్‌ లో చూసి హీరోయిన్‌ అయ్యింది అపూర్వ రావు, `మిణుగురులు` మూవీ అరుదైన ఘనత సాధించింది. మరోవైపు శేఖర్‌ కమ్ములు.. `షరతులు వర్తిస్తాయి` కోసం సపోర్ట్ చేశారు. 
 

సినిమా అంటే చాలా మందికి ప్యాషన్‌. సినిమాలు చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. కానీ గూగుల్‌ సెర్చ్ చేసి హీరోయిన్‌ అయ్యింది అపూర్వ రావు. తనకు ఏం చేయాలో తెలియదు. ఈ క్రమంలో గూగుల్‌లో సెర్చ్ చేయగా, హీరోయిన్‌ అనే ఆప్షన్‌ వచ్చింది. దీంతో మనం కూడా హీరోయిన్‌ అవుతే ఎలా ఉంటుందనే ఆలోచనతో అపూర్వ రావు సినిమా ప్రయత్నాలు చేసి,  ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె `హ్యాపీ ఎండింగ్‌` చిత్రంలో నటించింది. యష్‌ పూరి హీరోగా నటించారు. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను  తెలిపింది హీరోయిన్ అపూర్వ రావ్. ఒంగోలుకి చెందిన అపూర్వ రావు గుజరాత్‌లో పెరిగింది. ఇమాజినేషన్‌ అనే ఓ కొత్త కోర్స్ లో చేరిందట. గ్రాడ్యూయేట్‌ తర్వాత జాబులు చేసినా హ్యాపీ ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలని గూగుల్‌ లో సెర్చ్ చేస్తే హీరోయిన్‌ అనే ఆప్షన్‌ కనిపించింది. అలా తాను హీరోయిన్‌ అవ్వాలనే గోల్‌ ఏర్పర్చుకుందట. ఫిల్మ్ స్కూల్‌లో ట్రైన్‌ అయ్యిందట. ఈ క్రమంలో ఆడిషన్స్ చేస్తుంటే `హ్యాపీ ఎండింగ్‌` ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. మొదట తన హైట్‌ అడిగారట. అది తనకు విచిత్రంగా అనిపించిందని చెప్పింది. 

Latest Videos

`హ్యాపీ ఎండింగ్‌ బోల్డ్ కంటెంట్‌గా ఉన్నా, సినిమా మాత్రం చాలా ఫన్నీగా ఉంటుందని,నవ్వులు పూయించేలా ఉంటుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని తెలిపింది. యష్‌ మంచి కోస్టార్‌ అని తెలిపింది. `హీరోయిన్స్  శ్రీలీలను చూస్తే తను కూడా మన ఫార్మేట్ మూవీస్ లోనే డ్యాన్సెస్, పర్ ఫార్మెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. అలాగే  సమంత భిన్నమైన కాన్సెప్ట్స్ లు సెలెక్ట్ చేసుకుంటోంది. నేను కూడా అలా వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను.  శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంది. సాయి పల్లవి కెరీర్ చూస్తుంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేందుకు కావాల్సిన మోటివేషన్ కలుగుతుంటుంది. అవకాశాలు వస్తే ఆమెలా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలని ఉంది` అని చెప్పింది అపూర్వరావు.  

'మిణుగురులు'కి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో..

అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014 లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్ళేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది` అని తెలిపారు.  

`మిణుగురులు` 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో `గోల్డెన్ ఎలిఫెంట్` గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్, ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఉత్తమ చిత్రం' అవార్డు గెలుచుకుంది. 2014 లో 'అస్కార్స్' కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో 'మిణుగురులు' కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో 'మిణుగురులు' కథ కూడా ఉంటుంది. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్ , ఓటిటి లో చిత్రాలు ఉండడం విశేషం.

`ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి` కోసం శేఖర్‌ కమ్ముల.. ఏం చేశాడంటే..

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "షరతులు వర్తిస్తాయి" సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ సినిమా నుంచి 'పన్నెండు గుంజల పందిర్ల కిందా ..'లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ , దర్శకుడు కుమారస్వామి  బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. నేను` ఫిదా` సినిమాలో `వచ్చిండే` పాట రూపొందించినప్పుడు అదే ఆశించాను. తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చైతన్య రావ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా చేస్తున్నాడు. షరతులు వర్తిస్తాయి టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. మీ పాటలతో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. 

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - షరతులు వర్తిస్తాయి మూవీ నుంచి ఈ పాటను ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మా డైరెక్టర్ కుమారస్వామి శేఖర్ కమ్ముల పేరు చెప్పారు. ఆయన సినిమాలంటే అక్షరకు చాలా ఇష్టం. నేను కూడా శేఖర్ కమ్ముల కి అభమానిని. ఆయన సినిమాలు రూపొందించే విధానం, వాటికి ఎంచుకునే నేపథ్యం ఎంతో బాగుంటాయి. పన్నెండు గుంజల పందిర్ల కిందా పాట మీ అందరికీ నచ్చుతుంది. లక్షలాది పెళ్లిళ్లలో ఈ పాట మారు మ్రోగుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.  
 

click me!