#HanuMan: ‘హనుమాన్’ OTT రైట్స్ అంత తక్కువకా? రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Published : Feb 28, 2024, 08:22 AM IST
 #HanuMan: ‘హనుమాన్’ OTT రైట్స్  అంత తక్కువకా?  రిలీజ్ డేట్ ఎప్పుడంటే

సారాంశం

ఈ చిత్రం థియేటర్స్ లో అతి పెద్ద హిట్ అవడంతో హనుమాన్ ని ఓటిటిలో మరోసారి వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ ఇప్పటికీ థియేటర్స్ లో అక్కడక్కడా సందడి చేస్తూనే ఉంది.

'హనుమాన్' సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా భాక్సాఫీస్ దగ్గర  రచ్చ కొనసాగుతూనే ఉంది. నైజాంలో రికార్డ్ లు బ్రద్దలు కొడుతూనే ఉంది. చాలా మంది ఈ సినిమాని చూసేసారు. అయితే రకరకాల కారణాలతో థియేటర్ కు వెళ్లి చూడలేని వాళ్లు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.  అయితే థియేటర్ లో రన్ అవుతున్నప్పుడు వేస్తే  కలెక్షన్స్ పరంగా సినిమాకు దెబ్బ. అందుకే సినిమా ఓటిటి రైట్స్ అమ్ముడైనా పెండింగ్ పెట్టారు. ఈ క్రమంలో అసలు  'హనుమాన్' ఓటీటీ రైట్స్ ఎంతకు వెళ్లాయి. రిలీజ్ డేట్ ఎప్పుడు వంటి విషయాలు  విషయాలు బయటకొచ్చాయి. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ జీ 5 వాళ్లు రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ ని   తీసుకున్నారు. ఈ మేరకు 30 కోట్లు ఈ రైట్స్ కు చెల్లించినట్లు సమాచారం.  రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత స్ట్రీమ్ చేసేందుకు ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా భారీ  సక్సెస్ అవ్వటంతో నక్క తోక తొక్కినట్లు అయ్యింది. ఈ క్రమంలో థియేటర్ రన్ పూర్తయ్యే దాకా సినిమా ఓటిటిని ఆపుతానని మాట ఇచ్చి ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమ్ చేసేందుకు ఓకే చేసిందని సమాచారం.  మార్చి 8 నుంచి ఈ సినిమా ఓటిటిలో అన్ని భాషల్లో రానుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ థియేటర్ రెవిన్యూ వసూలు చేసింది. దాంతో ఓటిటిలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. 

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.    హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే