డిజాస్టర్ కి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన అనసూయ... అసలు ఊహించలేదు!

Published : Feb 27, 2024, 08:31 PM IST
డిజాస్టర్ కి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన అనసూయ... అసలు ఊహించలేదు!

సారాంశం

గత ఏడాది విడుదలైన ఓ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీకి సీక్వెల్ ముందే ప్రకటించారు. కనీస వసూళ్లు రాని పక్షంలో పార్ట్ 2 ఉండదని పలువురు భావించారు. అయితే అనసూయ కీలక అప్డేట్ ఇచ్చారు.   

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు పరిశ్రమలో ఓ ఇమేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయాలు సాధించాయి. తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఫార్మ్ కోల్పోయారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సక్సెస్ నేపథ్యంలో మహేష్ బాబు ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు. మహేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన రెండో మూవీ బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో శ్రీకాంత్ కి భారీ గ్యాప్ వచ్చింది. 

అసురన్ రీమేక్ నారప్ప చేశాడు. ఇది నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కాగా పెదకాపు మూవీ ప్రకటనతో శ్రీకాంత్ అడ్డాల మరోసారి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. ఆ టైటిల్ భిన్నంగా తోచింది. దాంతో అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా పెదకాపు 1 తెరకెక్కింది. కొత్త హీరోతో చేసిన ఈ ప్రయోగం ఫలితం ఇవ్వలేదు. కనీసం కోటి రూపాయల షేర్ పెదకాపు 1 రాబట్టలేకపోయింది. 

ఊహించని పరాజయం నేపథ్యంలో సీక్వెల్ ఉండదు అంటూ ప్రచారం జరిగింది. అయితే అనసూయ దీనిపై అప్డేట్ ఇచ్చింది. పెదకాపు 2 సెట్స్ లో జాయిన్ అయిన అనసూయకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెల్కమ్ చెప్పాడు. ఈ వీడియోని అనసూయ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది అనసూయ. కాబట్టి పెదకాపు 2 పై క్లారిటీ వచ్చేసింది. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌