సుహాస్‌ `అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌` కోసం `హనుమాన్‌` చేసిన సాయం ఏంటంటే..

Published : Jan 02, 2024, 11:15 PM IST
సుహాస్‌ `అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌` కోసం `హనుమాన్‌` చేసిన సాయం ఏంటంటే..

సారాంశం

యంగ్‌ హీరో సుహాస్‌ నెమ్మదిగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌` చిత్రంలో నటించాడు. ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది.

యంగ్ హీరో తేజా సజ్జ ప్రస్తుతం `హనుమాన్‌` చిత్రంలో నటించాడు. ఇది సంక్రాంతికి రానుంది. ఈనేపథ్యంలో ఆయన ఇప్పుడు సుహాస్ సినిమాకి సపోర్ట్ గా నిలిచాడు. సుహాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌`. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటని తాజాగా విడుదల చేశారు. దీన్ని తేజ సజ్జా విడుదల చేయడం విశేషం. తన సినిమా రిలీజ్‌ విషయంలో ఇతర హీరోల సహాయం తీసుకుంటున్న తేజ.. మరో చిన్న సినిమాకి తనవంతు సపోర్ట్ ఇవ్వడం విశేషం. 

సుహాస్‌ హీరోగా రూపొందుతున్న `అంబాజీపట మ్యారేజి బ్యాండ్‌` చిత్రంలోని పాటని తేజ విడుదల చేశాడు. `మా ఊరు` అంటూ సాగే పాటని మంగళవారం ఉదయం తేజ రిలీజ్‌ చేశాడు, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు. `మా ఊరు `అంటూ సాగే ఈ పాటని కాళ భైరవ ఆలపించారు. శేఖర్‌ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. రెహ్మాన్‌ లిరిక్స్ అందించారు. 'రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం...ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..'అంటూ సాగే ఈ పాట పల్లేటూరి యాసలో సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇక సుహాస్‌, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్‌, జబర్దస్త్ ప్రతాప్‌ భండారి, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. దుశ్వంత్‌ కటికినేని దర్శకత్వం వహించారు. వెంకటేష్‌ మహా బ్యానర్ మహాయన మోహన్‌ పిక్చర్స్, జీఏ 2 పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం