తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హను మాన్ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హను మాన్ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారిగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా సెలెబ్రటీలుగా మారిపోయారు. ఆంజనేయ స్వామి నేపథ్యంలో జనరంజకమైన సూపర్ హీరో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు అందించారు.
చాలా రోజుల క్రితమే ఈ చిత్రం ఓటిటిలోకి రావలసి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఆదివారంనుంచి తెలుగు వర్షన్ జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైంది. హిందీ వర్షన్ శనివారం నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ మొదలయింది. దీనితో మరోసారి హనుమాన్ హంగామా దేశం మొత్తం వినిపిస్తోంది.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యాక కాస్త నెగిటివిటి కూడా మూటగట్టుకుంది. అయితే ఆ నెగిటివిటి హను మాన్ సంచలనాలని అడ్డుకోలేకపోతోంది. జీ 5 లో విడుదలైన ఈ చిత్రం ఓటిటిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. అంతే కాదు ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నట్లు కూడా జీ 5 సంస్థ ప్రకటించింది.
తెలుగులో కూడా మీడియం బడ్జెట్ లోనే సూపర్ హీరో చిత్రాలు చేసి అద్భుతాలు సృష్టించవచ్చు అని ప్రశాంత్ వర్మ నిర్మూపించారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం 300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని కూడా హనుమాన్ క్లైమాక్స్ లో ప్రకటించారు. మరి ప్రశాంత్ వర్మ సీక్వెల్ ని ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. సీక్వెల్ కంటే ముందు ప్రశాంత్ వర్మ కొత్త చిత్రం తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.