వైరల్ ఫొటో: రక్త స్నానం చేస్తున్న హన్సిక

Published : Jan 02, 2019, 01:02 PM IST
వైరల్ ఫొటో: రక్త స్నానం చేస్తున్న హన్సిక

సారాంశం

ఏదో ఒక విభిన్నత, వివాదం లేనిదే ఎవరూ సినిమాలను పట్టించుకోవటం లేదు. ఈ విషయం అర్దం చేసుకున్న దర్శక,నిర్మాతలు  ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు

ఏదో ఒక విభిన్నత, వివాదం లేనిదే ఎవరూ సినిమాలను పట్టించుకోవటం లేదు. ఈ విషయం అర్దం చేసుకున్న దర్శక,నిర్మాతలు  ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు హన్సిక కొత్త సినిమాదీ అదే పరిస్దితి. తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో హన్సిక హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ పదకొండేళ్ల కాలంలో ఆమె ఎన్నో విభిన్న పాత్రలు చేశారు. తాజాగా హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మహా’.

హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్‌. జెమిల్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ‘మహా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ల మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్టుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పోస్టర్స్‌ మీద కొందరు అభ్యంతరాలు తెలిపారు. 

మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. ఆ వివాదం చల్లారక ముందే  ‘మహా’లోని మరో పోస్టర్ బయిటకు వచ్చింది‌. న్యూ ఇయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేశారు.  ఈ పోస్టర్ లో హీరోయిన్‌ హన్సిక మాత్రం  రక్తస్నానం చేస్తున్నారు. ఈ  పోస్టర్ వైరల్ అవుతోంది. 

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ కెరీర్లో ఇది 25వ చిత్రం. ఈ సినిమా కాకుండా హన్సిక నటించిన ‘100’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తెలుగులో ‘యన్‌.టీ.ఆర్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారామె. హీరోయిన్‌గా సందీప్‌ కిషన్‌ సరసన ఓ సినిమా చేయనున్నారు హన్సిక.  

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు