
హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా `105 మినిట్స్` సినిమా రూపొందుతుంది. దీనికి సంబంధించి గతంలో విడుదలైన మోషన్ పోస్టర్ ఆకట్టుకోగా , ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ లిరికల్ సాంగ్ సినిమా పైన ఇంకా ఆసక్తిని పెంచుతోంది. ఈ లిరికల్ సాంగ్ ని మొత్తం ఇంగ్లీష్ లిరిక్స్ తో ఒక డిఫరెంట్ ఫీల్ తో మన ముందుకు తీసుకొచ్చారు. సాంగ్ లో హన్సిక లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నువ్వు నా కలవి, నా కోరిక వి, నువ్వు నాకు ఎవరు, ఏమవుతావు, నేను ఇక్కడ లేను, అక్కడ లేను మొత్తం అంతా నేనే అంటూ ఒక డిఫరెంట్ లిరిక్స్ తో ఈ పాట కచ్చితంగా శ్రోతలను అందిస్తుంది. మోషన్ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ సినిమా పైన ఆసక్తిని ఇంకా పెంచేస్తున్నాయి.
మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీ గా ఈ సినిమా మన ముందుకు వస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
30 ఇయర్ పృథ్వీ డైరక్షన్‌లో `కొత్త రంగుల ప్రపంచం` రిలీజ్ డేట్..
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా `కొత్త రంగులు ప్రపంచం`. క్రాంతి, శ్రీలు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 20న బ్రహ్మాండంగా విడుదల అవుతుంది. గతంలో రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిచే రిలీజ్ అయిన ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభించింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. హీరో క్రాంతి మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. నాకు హీరోగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్ గారి కృతజ్ఞతలు అన్నారు.
డైరెక్టర్ పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ : నన్ను ఇన్నాళ్లు ఆర్టిస్ట్ గా ఎంతో ఆదరించారు ఈ సినిమాతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ముందే చెప్పా కొత్త వాళ్ళు కంప్లీట్ గా కొత్త హీరో కొత్త హీరోయిన్ కొత్త డైరెక్టర్ ఇలా అందరం కలిపి ఒక మంచి ప్రోడక్ట్ తో మీ ముందుకు రాబోతున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి కష్టపడి పని చేశారు. నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినా నా టీం కి ఆర్టిస్టులకి కృతజ్ఞతలు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అడిగిన వెంటనే మా ట్రైలర్ లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈనెల 20న సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ప్రేక్షకుల ఆదరణ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.