శ్రీలీలతో డాన్సు అంటే హీరోలకి తాట ఊడిపోతదంట.. మహేష్‌ బాబు షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

Published : Jan 09, 2024, 09:56 PM ISTUpdated : Jan 09, 2024, 10:35 PM IST
శ్రీలీలతో డాన్సు అంటే హీరోలకి తాట ఊడిపోతదంట.. మహేష్‌ బాబు షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

సారాంశం

శ్రీలీలపై క్రేజీ కామెంట్‌ చేశారు మహేష్‌ బాబు. ఆమె డాన్సు గురించి ప్రత్యేకంగా చెప్పాడు. `గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమెని హైలైట్‌ చేశాడు మహేష్‌.

మహేష్‌ బాబు.. శ్రీలీలపై క్రేజీ కామెంట్‌ చేశారు. ఆమె డాన్సు గురించి ప్రత్యేకంగా చెప్పాడు. `గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమెని హైలైట్‌ చేశాడు మహేష్‌. అంతేకాదు షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. శ్రీలీలతో డాన్సులంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈవెంట్‌ మొత్తాన్ని హోరెత్తించాడు. 

జనరల్‌గా మహేష్‌బాబు తన సినిమా ఈవెంట్లలో హీరోయిన్ల పేర్లు మర్చిపోతుంటారు. వారి గురించి చెప్పడం మర్చిపోతుంటాడనే వాదన ఉంది. అది తన వరకు వెళ్లినట్టుంది. తాజాగా శ్రీలీల విషయంలో ఆయనే దాన్ని ప్రస్తావించారు. దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత గురించి చెప్పిన అనంతరం. శ్రీలీల ప్రస్తావన తీసుకొచ్చాడు. మర్చిపోలేదు కంగారు పడకు అంటూ చెప్పి నవ్వులు పూయించాడు మహేష్‌బాబు. 

మరో తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉందని, మంచి నటిని తమ టీమ్‌ గుర్తించిందని తెలిపారు మహేష్‌. తను ఎంతో హార్డ్ వర్కర్‌ అని, సెట్‌లో తన షూట్‌ అయిపోయాక కార్వాన్‌లోకి వెళ్లదని, మేకప్‌ కోసం కూడా వెళ్లదని, అక్కడే తమతోపాటు ఉంటూ సపోర్ట్ గా ఉంటుందన్నారు మహేష్‌. ఈ సందర్భంగా ఆమె డాన్సు గురించి చెబుతూ, `ఈ అమ్మాయితో డాన్సు వేయడం.. వామ్మో.. అదేం డాన్సు అంటూ నవ్వులు చిందించిన మహేష్‌.. ఆమెతో డాన్సు అంటే హీరోలందరికి తాట ఊడిపోతుందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇలానే అద్భుతంగా చేస్తూ వెళ్లాలని, తనకు మంచి భవిష్యత్‌ ఉండాలని తెలిపారు మహేష్‌. 

ఇక ఇందులో మరో పాత్రలో నటించిన మీనాక్షి గురించి చెబుతూ, ఆమెది గెస్ట్ రోల్‌ అని తేల్చాడు మహేష్‌. ఆమెతో పనిచేయడం ఆనందంగా ఉందని, అడగ్గానే చిన్న రోల్‌ అయిన చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తమన్‌ మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు సొంత బ్రదర్‌ లాంటివాడని తెలిపారు మహేష్‌. 

ఇక దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి చెబుతూ, త్రివిక్రమ్‌ గురించి బయట ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడనని, ఎందుకంటే మన ఇంట్లో మనిషి గురించి ఎక్కువగా ఏం మాట్లాడతామన్నారు. కానీ ఈ రెండేళ్లు ఆయన తనకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంన్త్ ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయనకు థ్యాంక్స్ చెప్పడం కూడా వింతగా ఉందన్నారు. త్రివిక్రమ్‌తో సినిమా చేసినప్పుడల్లా నా పర్‌ఫెర్మెనస్ లో ఒక మ్యాజిక్‌ జరుగుతుంది, అది నాకూ తెలియదు. `అతడు` నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలో, అలాగే `ఖలేజా`లో ఒక మ్యాజిక్‌ జరిగింది. అదే మ్యాజిక్‌ ఇప్పుడు `గుంటూరు కారం`లో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం` అని చెప్పారు మహేష్‌. ఈ మూవీ గుంటూరులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగడానికి ఆయనే కారణమని, ఆయనే గుంటూరుని సజెస్ట్ చేశారని తెలిపారు. అందుకే మనూర్లో ఈవెంట్‌ చేస్తున్నట్టు తెలిపారు మహేష్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు